Karan Johar
ఎంటర్‌టైన్మెంట్

Karan Johar: షాక్.. గుర్తుపట్టలేని అవతార్‌లో కరణ్ జోహార్‌!

Karan Johar: బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్‌ లేటెస్ట్ ఫొటో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ పిక్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు. కారణం, అసలు ఈ ఫొటోలో ఉంది కరణ్ జోహారేనా? అనేలా ఆయన ఆకారం మారిపోయింది. ఎప్పుడూ హుషారుగా కనిపిస్తూ, బాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా ఉండే కరణ్ జోహార్‌ని ఇలా చూసిన వారంతా.. ఆయనకి ఏమైంది? ఏమైనా ఆరోగ్య సమస్యలా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు ఈ ఫొటోని చూసి ఇంకో రకంగా కూడా రియాక్ట్ అవుతున్నారు.

Also Read- Beauty Song: ‘బ్యూటీ’ కన్నమ్మ.. భలే ఉందమ్మా!

ఏదైనా ప్రమోషన్స్‌లో భాగంగా ఇలా ఆయన మేకోవర్ అయ్యారా? లేదంటే మేకప్ లేకుండా క్లోజప్ షాట్‌లో కనిపించి, ఇలా అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారా? అనేలా చర్చిస్తున్నారు. ఎంత క్లోజప్ అయినా, ఎంత ప్రమోషన్స్ అయినా.. మరీ ఇంతగా అయితే బక్కచిక్కిపోరు కదా. అందులోనూ బాలీవుడ్‌లో స్టైలీష్ ఐకాన్‌గా ఆయన ఎప్పుడూ కనిపిస్తుంటారు. ఆయన డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ ఇలా అన్నీ కూడా ఎప్పుడూ నూతనంగా ఉంటాయి. అలాంటిది, ఒక పేషెంట్‌లా ఆయన మారిపోవడంతో.. ఏదో సమ్‌థింగ్ జరిగిందనేలా బాలీవుడ్ సర్కిల్స్‌లో సైతం టాక్ వినిపిస్తుండటం విశేషం.

ఇక ఈ ఫొటోను చూసిన కరణ్ జోహార్ అభిమానులైతే కంగారు పడిపోతున్నారు. ఆయనకు ఏదో అయిందని, అందుకే ఇలా బక్కచిక్కిపోయి కనిపిస్తున్నారనేలా మాట్లాడుకుంటున్నారు. నిజంగానే ఆయన లుక్ చూస్తుంటే, ఆయనకి ఏదో ఆరోగ్య సమస్య ఉన్నట్లే అనిపిస్తుంది. టాలీవుడ్‌తో పాటు, ఇతర సినిమాలకు బాలీవుడ్‌లో పెద్ద దిక్కుగా ఉండే కరణ్ జోహార్‌ని ఇలా చూసిన సినీ పర్సనాలిటీస్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆయనకి ఏమైందో అంటూ వాకబు చేస్తున్నారు. అసలు కరణ్ జోహార్‌కు ఏమైంది అనేది తెలియాలంటే మాత్రం, ఆయన లేదంటే ఆయన తరపు వారు ఎవరైనా రియాక్ట్ కావాల్సి ఉంది. మరి ఎవరు ఈ అనుమానాలకు తెరదించుతారో చూడాలి.

Also Read- Ashwin Babu: అశ్విన్ బాబు 9వ చిత్రానికి టైటిల్ ఫిక్స్.. మరో పవర్ ఫుల్ టైటిల్ పట్టారుగా!

ఇక కరణ్ జోహార్‌ని ఇలా చూసిన వారంతా.. కోలీవుడ్ హీరో విశాల్‌ని గుర్తు చేసుకుంటుండటం విశేషం. ఎందుకంటే, రీసెంట్‌గా విశాల్ నుంచి వచ్చిన సినిమా ప్రమోషన్స్‌లో ఆయన కూడా ఇలాంటి అవతార్‌లోనే కనిపించారు. గజగజ వణికిపోతూ, బాగా బక్కచిక్కిపోయి, ఏదో వ్యాధితో బాధపడుతున్నట్లుగా కనిపించి, అందరికి షాక్ ఇచ్చారు. తర్వాత కొన్ని రోజులకు మళ్లీ నార్మల్‌గానే కనిపించారు. విశాల్‌లానే ఇప్పుడు కరణ్ జోహార్‌ని అంతా పోల్చుతున్నారు. ఏదిఏమైనా, ఆయన త్వరగా కోలుకుని మళ్లీ నార్మల్ అవతార్‌లోకి రావాలని ఆయన అభిమానులంతా కోరుకుంటున్నారు.

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలందరూ డైట్ కోసం ఇలానే కనిపిస్తున్నారు. రవితేజ, రీసెంట్‌గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ఇలాగే కనిపించారు. ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్‌లో ఎన్టీఆర్‌ని చూసిన వారంతా షాక్ అయ్యారు. గతంలో ఒకసారి కూడా ఎన్టీఆర్ పూర్తిగా తగ్గి, బాగా బక్కచిక్కిపోయి కనిపించారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన పర్ఫెక్ట్ లుక్‌నే మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు సడెన్‌గా ఆయనలో కూడా మార్పు వచ్చింది. ఇలా కరణ్ కూడా ఏదైనా డైట్ ఫాలో అవుతున్నాడా? అనేలా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు ఈ పిక్ ఫేక్ అంటూ కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?