Petrol Diesel Prices: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఇంధన ధరలపై విధించే ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై లీటర్ రూ. 2 చొప్పున కేంద్రం వడ్డించనుంది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ.2 మేర పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెంచిన ఎక్సైజ్ డ్యూటీ ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది.
Also Read: Ap Govt Research Results: ఏపీలోని ఆ జిల్లాలు వెరీ డేంజర్.. వెలుగులోకి సంచలన నిజాలు..
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్న క్రమంలో.. పెట్రోల్, డీజిల్ ధరలను కూడా తగ్గించాలని గత కొన్ని రోజులు వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే అందుకు విరుద్ధంగా చమురుపై విధించే ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం పెంచడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.46గా ఉంది. డీజిల్ ను లీటరుకు రూ. 95.70 విక్రయిస్తున్నారు. ఇవాళ అర్ధరాత్రి తర్వాత నుంచి వీటి ధరల్లో మార్పులు వచ్చే ఛాన్స్ ఉంది.