Beauty Movie Poster
ఎంటర్‌టైన్మెంట్

Beauty Song: ‘బ్యూటీ’ కన్నమ్మ.. భలే ఉందమ్మా!

Beauty Song: వానరా సెల్యులాయిడ్, మారుతీ టీం ప్రొడక్ట్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘బ్యూటీ’. ‘గీతా సుబ్రమణ్యం, హలో వరల్డ్, భలే ఉన్నాడే’ చిత్రాల దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కె ఆర్ బన్సాల్ నిర్మించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందిస్తున్నారు. యంగ్ హీరో అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, మోషన్ పోస్టర్, గ్లింప్స్, సాంగ్స్ అన్నీ కూడా ప్రేక్షకులను అలరించి, సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో బ్యూటీ‌ఫుల్ సాంగ్‌ని మేకర్స్ వదిలారు.

Also Read- Ashwin Babu: అశ్విన్ బాబు 9వ చిత్రానికి టైటిల్ ఫిక్స్.. మరో పవర్ ఫుల్ టైటిల్ పట్టారుగా!

‘కన్నమ్మ కన్నమ్మ నేనే నువ్వా..
ఏనాడో నాకోసం పుట్టేశావా..
అందం గురి పెట్టేశావే.. నన్నే పడగొట్టేశావే.
కళ్లల్లో కళ్లల్లో ప్రేమే నువ్వా
ప్రాణంలో ప్రాణంగా ప్రేమిస్తావా..
నాకే నువ్ నచ్చేశావే.. నీకే మనసిచ్చేశాలే..
ఎదురుగా నువ్వే ఉంటే.. నే గుర్తేరానే..
నిన్నే చూడకపోతే.. దిగులైపోతానే
ఎవరూలేని ఎదలో నిలిపావే పాదం
ఎటుకో తరిమేశావే.. ఏకాంతం మొత్తం
చినుకుచినుకుగా మనసుపైన తనువు కురిసే వర్షంలా
పెదవికెదురుగా పెదవిపడేన నరకముందే స్వర్గంలా..’ అంటూ సాగిన ఈ పాటకు సనారే సాహిత్యం అందించగా.. ఆదిత్య ఆర్కే, లక్ష్మీ మేఘన ఆలపించారు. విజయ్ బుల్గానిన్ హృద్యమైన బాణీతో వినగానే ఆకట్టుకునేలా ఈ పాటకు స్వరాలు సమకూర్చారు.

ఇద్దరు ప్రేమ జంట హాయిగా పాడుకునేలా ఈ పాటను కంపోజ్ చేసిన తీరు, చిత్రీకరించిన తీరు ఎంతో ఆకట్టుకునేలా ఉంది. పాట సాహిత్యం, పిక్చరైజేషన్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ అన్నీ కూడా శ్రోతల్ని ఇట్టే ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘ఆయ్, మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ వంటి సినిమాలో తనదైన మార్క్‌తో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అంకిత్ కొయ్య ఈ సినిమాలో సోలో లీడ్‌గా అందరినీ మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా వంటి వారంతా ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు.

Also Read- Ajith Kumar: బ్రేకింగ్.. కుప్పకూలిన స్టార్ హీరో 285 అడుగుల కటౌట్.. ఎక్కడంటే?

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే.. మంచి ప్రేమకథ ఇందులో ఉన్నట్లుగా అర్థమవుతుంది. అలాగే ఇద్దరు యంగ్ కపుల్ మధ్య ప్రేమని, ఎంతో చక్కగా ఈ చిత్రంలో దర్శకుడు చూపిస్తున్నాడనే విషయం కూడా తెలుస్తుంది. ఈ అంశాలతో ఈ ఏడాదిలో రాబోతోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటిగా ‘బ్యూటీ’ చేరిందనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. మరి ఈ క్రేజ్ ఈ సినిమా సక్సెస్‌కు ఎంత వరకు యూజ్ అవుతుందనేది చూడాల్సి ఉంది. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ