Health Tips: నిద్రపోయేటప్పుడు లైట్ వేసుకుని పడుకోవచ్చా ? లేక లైట్ ఆఫ్ చేసి పడుకోవాలా అని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అయితే, మనలో చాలా మంది అర్ధ రాత్రి వరకు ఫోన్స్ వాడుతూనే ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదని వైద్యులు కూడా చెబుతున్నారు. అయితే, తాజాగా నిపుణులు ప్రయోగాలు చేసి షాకింగ్ నిజాలు వెల్లడించారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
లైట్ వేసుకుని పడుకునే అలవాటు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో లైట్ వేసుకోవద్దని అంటున్నారు. దీని వలన లాభాలు కంటే నష్టాలే ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు చూడటానికి చాలా చిన్నగా అనిపిస్తాయి. ఆ రోజు వరకు ఏం కాదు, కానీ ముందు ముందు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు.
నిద్ర అనేది మనకి మంచి హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అదే మెలటోనిన్. ఇది మన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇది చీకటిలో ఉనప్పుడు మాత్రమే ఎక్కువ రిలీజ్ అవుతుంది. లైట్ వేసి ఉంచినప్పుడు ఇది తక్కువగా విడుదలయ్యి మనకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. లైట్ వేసి ఉంచడం వలన శరీరంలో ఇన్సులిన్ శోషణ తగ్గిపోతుంది. టైప్ 2 డైయాబెటిస్ కూడా దీని వలెనే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. లైట్ అలాగే, 24 గంటలు ఉండటం వలన డైయాబెటిస్ పెరిగే అవకాశం ఉంది.
అంతే కాదు, గుండె మీద కూడా దీని ప్రభావం ఉంటుందని అంటున్నారు. మనం పడుకున్నప్పుడు మన హార్ట్ బీట్ నార్మల్ గానే ఉంటుందని అనుకుంటారు. కానీ, నిజం లేదని చెబుతున్నారు. ఒక్కోసారి గుండె పోటు వచ్చే అవకాశం ఉందని స్టడీ చేసిన అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి, నిద్ర పోతున్నప్పుడు బెడ్ లైట్ , ట్యూబ్ లైట్ వేసుకుని పడుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.