Adavi Talli Bata: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan).. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం పోతంగి పంచాయతీలోని పెదపాడు గ్రామంలో పర్యటించిన పవన్.. అక్కడ జన్ మన్ పథకం కింద మంజూరైన రహదారులకు శంకుస్థాపన చేశారు. గడ్డపార పట్టి స్వయంగా భూమి పూజ చేశారు. అనంతరం పెదపాడు గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత అంగన్వాడి స్థానిక అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన పవన్.. గర్భిణులకు ప్రభుత్వం తరపున కిట్లను పంపిణీ చేశారు. అంతేకాకుండా గ్రామంలోని చిన్నారులకు తన వెంట తెచ్చిన స్వీట్ బాక్స్ లను పంచారు. గ్రామస్తుల ముఖాముఖిలో అడిగిన 12 సమస్యలను 6 నెలల్లో పరిష్కరించాలని అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు సూచించారు.
అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడిన పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జన్ మన్ పథకం కింద అల్లూరి ఏజెన్సీకి రూ.16 .7 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. పెదపాడు గ్రామానికి మరింత సదుపాయాలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాని అన్నారు. మీతో పాటు నడిచి మీ కష్టాన్ని చూశాను కాబట్టే ఈ రహదారులను పోరాడి సాధించినట్లు పవన్ అన్నారు.
నియోజకవర్గంలో తమకు ఓటు వేయకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu), తాను చర్చించుకుని ఈ రహదారులను మంజూరు చేయించినట్లు పవన్ తెలిపారు. కాగా అంతకుముందు గ్రామంలోకి రావడానికి పవన్ కిలోమీటర్ మేర నడిచారు. గిరిజన మహిళలతో మాట్లాడుకుంటూ పెదపాడు గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడుతూ ఒరియా భాషలో గిరిజనులకు పవన్ నమస్కారం తెలియజేశారు.
Also Read: Stock Market Crash: భారత్ లో బ్లడ్ బాత్.. రూ.19 లక్షల కోట్లు హాంఫట్.. అసలేం జరుగుతోంది!
ఇదిలా ఉంటే 2018 లో దుంబ్రిగూడ గిరిజన మహిళలు సుభద్రమ్మ, రాములమ్మ.. జనసేనాని పవన్ తమ గ్రామానికి రోడ్లు తీసుకొస్తారని ప్రకటించారు. నీటి సౌకర్యం సైతం కల్పిస్తారని అన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ డిప్యూటీ సీఎం హోదాలో పవన్.. గ్రామంలో రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం విశేషం.