Adavi Thalli Bata(image credit:X)
ఆంధ్రప్రదేశ్

Adavi Thalli Bata: అడవి బాట పట్టిన పవనన్న.. కారణం ఇదేనా?

Adavi Thalli Bata: గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ‘అడవి తల్లి బాట’ పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అడుగులు పడబోతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో రెండు రోజులపాటు పవన్ పర్యటించనున్నారు. సోమవారం ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేరుగా అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామానికి పవన్ చేరుకుంటారు.

పెదపాడు గ్రామంలోని గిరిజన ఆవాసాలను సందర్శించడంతోపాటు అడవి తల్లి బాట పేరిట చేపట్టే రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు. 8న ఉదయం అరకు మండలం, సుంకరమిట్ట చేరుకుని అక్కడ నిర్మించిన ఉడెన్ బ్రిడ్జికి ప్రారంభోత్సవం చేస్తారు.

Also read: Telangana : బీజేపీ నేతలకు కొత్త ట్విస్ట్.. కేసులుంటేనే లీడర్స్? 

అక్కడి నుంచి విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు చేరుకుంటారు. అక్కడ ఎకో టూరిజంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో పర్యటక అభివృద్ధి, ఎకో టూరిజంకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. గిరిజన గ్రామాల మధ్య అనుసంధాన రోడ్ల అభివృద్ధి, రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రోత్సాహంపై పవన్ ప్రధానంగా దృష్టి సారించనున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!