అమరావతి స్వేచ్ఛ: Ravi Naidu on RK Roja: మాజీ మంత్రి రోజా సెల్వమణిని అరెస్ట్ చేయడానికి దమ్ము అక్కర్లేదని, వారెంట్ ఉంటే చాలని శాప్ ఛైర్మన్ రవి నాయుడు వ్యాఖ్యానించారు. రోజా చేస్తున్న వరుస సవాళ్లపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ రోజా జైలుకు వెళ్లడం గ్యారంటీ అని తేల్చి చెప్పారు. ఆడుదాం ఆంధ్రలో రోజా అవినీతిపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోందన్నారు. నిరుపేదల క్రీడాకారులకు చెందిన రూ.119కోట్లను రోజా దోచేశారని ఆరోపించారు. రోజా నోటి దురుసుతోనే 2024 ఎన్నికల్లో వైసీపీకి 11సీట్లు వచ్చాయని విమర్శలు గుప్పించారు.
Also Read: Ap Mega DSC: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీ పై బిగ్ అప్డేట్
ఓట్ల కోసం 17 ఏళ్లు పైబడిన వారికే క్రీడల్లో అవకాశం కల్పించారన్నారు. రోజా పెద్ద అవినీతి తిమింగళం అని చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలోనూ దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. రోజా అవినీతి త్వరలోనే బట్టబయలు అవుతుంది. కోట్లకు కోట్లు నొక్కేసి బంగారు నగలు, నెక్లెస్‌లు కొనుగోలు చేశారు. రోజా బండారం అంతా మరికొన్ని రోజుల్లో బయటపడుతుంది. ఆమె అవినీతిపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోంది. రోజాను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేసి తీరుతాం. తనను అరెస్టు చేయమని పదే పదే కోరనక్కరలేదు అని రవినాయుడు ఎద్దేవా చేశారు.
అభినయ్‌కు ఏం తెలుసు?
చంద్రబాబును ఏకవచనంతో మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. చెన్నైలో తిరిగే రోజాకు ఏపీలో జరిగే అభివృద్ధి, సంక్షేమం గురించి ఏం తెలుస్తుంది? తిరుపతిలో వైసీపీ నేతలు పగటివేషగాళ్ళలాగా తయారయ్యారు. విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్న విషయం భూమన అభినయరెడ్డికి తెలియకపోవడం విడ్డూరం. విద్యుత్ ఛార్జీలపై బహిరంగ చర్చకు అభినయరెడ్డి సిద్దమా? భూమన అభినయరెడ్డికి కనీస పరిజ్ఞానం కూడా లేదు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో అసలు పాత్రధారి ఆయనే. బాధితుల ముందుకు అభినయ్ వస్తే ప్రజలే బుద్ధి చెబుతారు.
చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీలో అభివృద్ధి, సంక్షేమం రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. మాజీ సీఎం వైఎస్ జగన్ వీకెండ్ పొలిటీషియన్‌గా మారారు. బెంగళూరులో బిజినెస్ చేసుకుంటూ వైసీపీని, కార్యకర్తలను గాలికి వదిలేశారు. జగన్ ఇకపై కర్ణాటకలో స్థిరపడాలి’ అని రవి సలహా ఇచ్చారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/