Paravada Pharmacy : గత కొంత కాలం నుంచి పరవాడ ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ రోజు మరో ప్రమాదం చోటు చేసుకుంది. విష వాయువు లీక్ కావడంతో అక్కడ పని చేస్తున్న కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. తోరెంట్ ఫార్మాసిటికల్ లిమిటెడ్ లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. అతన్ని ఆసుపత్రికి తరలించగా.. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పరవాడ మండలం తానాం గ్రామానికి చెందిన చీపురుపల్లి అప్పలనాయుడు(35) రామ్‌కీ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో కార్మికుడిగా పని చేస్తున్నాడు.
విష్ణు కెమికల్స్ ఫ్యాక్టరీలో జనవరి 25న జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు ప్రాణాలు విడిచాడు. ఫ్యాక్టరీ కన్వేయర్ బెల్ట్‌లో పడి కార్మికుడు అక్కడక్కడే మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికుడిగా గుర్తించారు. అంతే కాదు, జనవరి 21వ తేదీన ఓ ఘటన చోటు చేసుకుంది. మెట్రోకెన్ ఇండస్ట్రీ స్టోరేజ్ ట్యాంక్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందివ్వగా.. వారు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.. దీంతో, అక్కడున్నవారందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ పై హైటెక్ కుట్రలు.. ఫేక్ వీడియోల హల్ చల్.. నెటిజన్స్ ఫైర్..