CM Revanth Reddy (Image Source: Twitter)
సూపర్ ఎక్స్‌క్లూజివ్

CM Revanth Reddy: సీఎం రేవంత్ పై హైటెక్ కుట్రలు.. ఫేక్ వీడియోల హల్ చల్.. నెటిజన్స్ ఫైర్..

CM Revanth Reddy: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్ సీయూ)కి ఆనుకొని ఉన్న 400 ఎకరాల భూమిపై తలెత్తిన వివాదం.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ భూములను అభివృద్ధి పనులకు వినియోగించాలన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ నిర్ణయాన్ని తప్పుబడుతూ హెచ్ సీయూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలోనే బీఆర్ ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీలు ఈ వ్యవహారంలో తలదూర్చడంలో భూముల వివాదం రాజకీయ రంగు పూలుముకుంది. ఈ క్రమంలోనే ఆయా పార్టీలకు చెందిన సోషల్ మీడియా విభాగాలు రేవంత్ సర్కార్ ను ఇరుకున పెట్టేందుకు తప్పుడు వీడియోలను నెట్టింట సర్క్యూలేట్ చేస్తున్నాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.


ఫేక్ వీడియోలు వైరల్..
హెచ్ సీయూ (HCU)కు ఆనుకొని ఉన్న కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల్లో పెద్ద ఎత్తున చెట్లు, చేమలు ఉన్నాయి. దీంతో అక్కడ వన్యప్రాణులు, నెమళ్లు, పలు పక్షిజాతులు జీవిస్తున్నట్లు హెచ్ సీయూ విద్యార్థులతో పాటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే అలాంటివేమి లేవని సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు (Telangana Ministers), ప్రభుత్వ ప్రతినిధులు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలోనే ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా పలు ఏఐ వీడియోలు (AI Generated Videos), ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 400 ఎకరాల భూముల్లో చెట్లను కొట్టివేయడం వల్ల.. అక్కడ నివసించే జింకలు.. జనావాసాల్లోకి వచ్చినట్లు పలు ఫేక్ వీడియోలను (HCU Fake Videos) విపక్ష పార్టీలకు చెందిన సోషల్ మీడియా విభాగం పోస్ట్ చేశాయి.

ప్రజల్లో అపోహలు..
హెచ్ సీయూ భూముల పరిధిలో జింకలు వంటి వన్యప్రాణులు జీవించేందుకు అవకాశమే లేదని కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చెబుతున్నప్పటికీ.. ప్రజలు ఈ ఫేక్ వీడియోల కారణంగా గందరగోళంలో పడుతున్నారు. ఏది నిజం.. ఏది అబద్ధం అని ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. 400 ఎకరాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల కారణంగా ఆవాసాన్ని కోల్పోయి.. ఓ జింక జనావాసంలోకి వచ్చిన ఓ వీడియో నెట్టింట ప్రత్యక్షమైంది. దానికి ఓ ఇంటి యజమాని నీళ్లు తాపిస్తున్నట్లుగా అందులో ఉంది. అయితే ఆ వీడియో హైదరాబాద్ కు సంబంధించినది కాదని అధికార వర్గాలు ధ్రువీకరించాయి. ఏపీలోని వైజాగ్ మారుమూల ప్రాంతాల్లో తీసిన వీడియోను.. హెచ్ సీయూ వివాదంలోకి తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టం చేశారు.


Also Read: CM Revanth Reddy: నిధులకు డోంట్ వర్రీ.. విద్యార్థుల కోసం ఎంతైనా ఓకే.. సీఎం రేవంత్ రెడ్డి

కేసులు నమోదు
ఫేక్ వీడియోలతో పాటు ఏఐ సాయంతో రూపొందించిన ఫొటోలు సైతం.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓవైపు ప్రొక్లెయిన్లు చెట్లు కొట్టేస్తుండగా అక్కడి నుంచి నెమళ్లు, జింకలు, పక్షులు పారిపోతున్నట్లుగా కొన్ని ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే పదుల సంఖ్యలో జింకలు.. 400 ఎకరాల భూముల్లో పరిగెడుతున్నట్లు మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే అవన్నీ వాస్తవం0 కాదని.. ఎక్కడో తీసిన ఏఐ ద్వారా వీడియోలను సృష్టించి ఈ వివాదానికి అంటగడుతున్నారని అధికార వర్గాలు ఫైర్ అవుతున్నాయి. దీని వెనక ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ (BRS) ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ పార్టీకి చెందిన పలు సోషల్ మీడియా ఖాతాలపై కేసులు సైతం నమోదు చేశారు.

విష ప్రచారంపై ఫైర్
ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాను తమ రాజకీయ అవసరాలకు అస్త్రాలుగా పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. ఇది సమాజానికి ఏ మాత్రం మంచి చేయదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అసత్య వార్తలు, ఫేక్ వీడియోలను ప్రచారం చేయడం ద్వారా సమాజాన్ని గందరగోళానికి గురి చేసే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ సిద్ధాంతాలు, నిర్ణయాలను ప్రొమోట్ చేసుకునేంత వరకే సోషల్ మీడియాను పరిమితం చేయాలని సూచిస్తున్నారు. అలా కాకుండా అసత్యాలతో ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేయాలని చూస్తే.. అది రాజకీయాలను అస్థిర పరిచే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు నెటిజన్లు సైతం ఫేక్ వీడియోలను తప్పుబడుతున్నారు. ఇలాంటివి రాజకీయాల్లో ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేస్తున్నారు.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?