అమరావతి స్వేచ్ఛ: Pawan Kalyan: శ్రీరామనవమి సందర్భంగా శని, ఆదివారాల్లో భద్రాచలం పట్టణాన్ని సందర్శించి, సీతారాములవారిని దర్శించుకోవాలనుకున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఏపీ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు సమర్పించేందుకు తొలుత షెడ్యూల్ ఖరారైనప్పటికీ, తన పర్యటన కారణంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పర్యటన రద్దు విషయాన్ని తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీకి సమాచారం పంపించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 7, 8 తేదీల్లో అల్లూరి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. 7న పెదపాడులో పలు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 8న అరకు సమీపంలో సుంకరమెట్ట వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టుకు భూమి పూజ చేస్తారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/