Alekhya Chitti Pickles Controversy
ఎంటర్‌టైన్మెంట్

Alekhya Chitti Pickles Controversy: నా ముగ్గురు చెల్లెళ్లు తప్పు చేశారు.. క్షమించండి.. అన్వేష్ వీడియో వైరల్!

Alekhya Chitti Pickles Controversy: గత వారం రోజులుగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అలేఖ్య పచ్చళ్లు అమ్ముతున్న అమ్మాయిల వీడియోలు మోత మోగుతున్నాయి. ఆ అమ్మాయిలు (సుమ, అలేఖ్య, రమ్య) మాట్లాడే మాటలు, కాదు కాదు బూతులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీ పచ్చళ్ల రేటు ఎక్కువగా ఉందని అన్నందుకు వారు మాట్లాడిన విధానం, చాలా అసభ్యకరంగా ఉంది. ఇలా మాట్లాడితే త్వరగా ఫేమస్ అయిపోతామని అనుకున్నారో, లేదంటే కావాలనే ఇలా చేశారో తెలియదు కానీ, ఫేమస్ అయితే అయ్యారు కానీ, అది వేరే విధంగా వారి లైఫ్‌పై ఎఫెక్ట్ పడేలా చేసింది. ప్రస్తుతం అంతా ఈ అక్కాచెల్లెళ్లని అసహ్యించుకుంటున్నారు. ఇప్పుడు వీరి తరపున మాట్లాడేందుకు నా అన్వేషణ అన్వేష్ లైన్‌లోకి వచ్చాడు. వారు చేసింది తప్పే.. అందుకే నేను క్షమాపణలు చెబుతున్నానంటూ అన్వేష్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అన్వేష్ ఏమన్నారంటే..

Also Read- Mohan Babu: పక్కవాళ్లు నాశనం కావాలని ఎప్పుడూ కోరుకోకూడదు.. ఏం చెప్పారు సార్!

యూట్యూబ్ స్టార్ట్ చేసే సమయంలో నన్ను సంప్రదించారు. వారికి నేను కొన్ని సూచనలు కూడా చేశాను. అప్పట్లో వారు బెట్టింగ్ యాప్స్ కూడా ప్రచారం చేశారు. ఆ పాపం ఈరోజు వారికి తగిలింది. వారికి చేయవద్దని చెప్పాను. నా మాట విని వారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయలేదు. అలేఖ్య బూతులు మాట్లాడకుండా ఉండాల్సింది. సోషల్ మీడియా ట్రోలింగ్స్‌తో అలేఖ్య అనారోగ్యానికి గురైంది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో ఉంది. దయచేసి వారిని ఇక వదిలేయండి. ప్రస్తుతం పచ్చళ్ల బిజినెస్‌ నాశనమైందని. ఇకపచ్చళ్లను అమ్మను కూడా అమ్మం. ఇక దానిని పక్కన పెట్టి లడ్డూల బిజినెస్ చేస్తాం. నేను ప్రమోషన్స్ చేయను. ప్రస్తుతం నా ముగ్గురు చెల్లెళ్లని వదిలేయండి. ముగ్గురు క్షమాపణలు చెప్పేశారు.

దేశంలో ఇంకేది సమస్య లేనట్లు.. ఇదే పెద్ద సమస్యగా చూస్తున్నారు. తిట్టింది నిజమే. ఎవరిని తిట్టింది కస్టమర్స్‌ని. కస్టమర్స్ అంటే దేవుళ్లు. ఎందుకు తిట్టిందీ అంటే వ్యాపారం చేయడం చేతకాకనే తిట్టింది. మా ఖర్మ బాగోక, ఇంకా చెప్పాలంటే బీపీ, బలుపు ఎక్కువై తిట్టేశాం. అయిపోయింది, వ్యాపారం కూలిపోయింది. దుకాణాలు అన్నీ మూసేశాం. బీపీ, నోటిదూల ఉన్నవాళ్లకి వ్యాపారం పని చేయదు. ఉదాహరణ నేను, మా చెల్లెళ్లు. ఇక మార్చుకుంటాం. మళ్లీ తిరిగొస్తాం. ఇక్కడ మంచి మాటలు మాట్లాడిన వాళ్లందరూ మంచోళ్లు కాదు. అలాగే బూతులు మాట్లాడిన వాళ్లు కూడా చెడ్డవాళ్లు కాదు. ఇక్కడ ఎవరూ పత్తిత్తులు కాదు. అది గుర్తు పెట్టుకోండి.. అంటూ అన్వేష్ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.

Also Read- Kousalya Tanaya Raghava: సీత ప్రేమలో రాముడు పడితే.. సందేశాత్మక కలియుగ రామాయణం

ఇంకా అన్వేష్ ఏమన్నారంటే తెలియాలంటే పై వీడియో చూడాల్సిందే. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?