Kousalya Tanaya Raghava: మంచి కంటెంట్‌తో వచ్చే ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు ఎప్పుడూ ఇండస్ట్రీలో డిమాండ్ ఉంటుంది. స్వచ్ఛమైన వింటేజ్ విలేజ్ లవ్ ఎమోషనల్ డ్రామాలు ఈ మధ్యకాలంలో తక్కువయ్యాయనే చెప్పుకోవచ్చు. ఆ లోటుని భర్తీ చేసేలా ఇప్పుడు ‘కౌసల్య తనయ రాఘవ’ అనే చిత్రం రాబోతోంది. రాజేష్ కొంచాడా, శ్రావణి శెట్టి నటీనటులుగా ఏఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని అడపా రత్నాకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్వామి పట్నాయక్ కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు.
Also Read- Jr NTR: ‘కంత్రీ’ లుక్.. ‘మ్యాడ్ స్క్వేర్’ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ని చూసి ఫ్యాన్స్ షాక్!
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు, టీజర్, సాంగ్స్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకుని మంచి ఆదరణను రాబట్టుకోగా.. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆర్కే నాయుడు, చంటి, నిర్మాత రత్నాకర్ సంయుక్తంగా ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ట్రైలర్ విషయానికి వస్తే..
Also Read- Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బర్త్‌డే ట్రీట్ అదిరింది.. విజయ్ దేవరకొండే హైలెట్!
సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారనేది ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఒక ఊరు.. అందులో హీరో, హీరోయిన్, విలన్ అన్నట్లుగా నడిచిన ఈ సినిమాలో ఓ మంచి ప్రేమ కథతో పాటు మంచి సందేశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరికీ చదువు ముఖ్యమని అంతర్లీనంగా ఇందులో దర్శకుడు సందేశాన్ని ఇస్తున్నారు. 80వ దశకంలో జరిగిన కథను తెరపై మరింత అందంగా మలిచినట్లుగా అనిపిస్తుంది. ఇక ఈ ట్రైలర్‌లో విజువల్స్, మ్యూజిక్ నేచురల్‌గా ఉన్నాయి. యోగి రెడ్డి కెమెరా వర్క్ నాటి కాలానికి తీసుకెళ్లగా.. రాజేష్ రాజ్ తేలు మ్యూజిక్ ఎంతో వినసొంపుగా ఉంది. ఏప్రిల్ 11న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లుగా దర్శకనిర్మాతలు తెలిపారు.
ట్రైలర్ విడుదల సందర్భంగా దర్శకుడు స్వామి పట్నాయక్ మాట్లాడుతూ ‘కౌసల్య తనయ రాఘవ’ సినిమా చాలా బాగా వచ్చింది. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నిర్మాత రత్నాకర్ ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. రాజేష్, శ్రావణి, ఆర్కే నాయుడు ఇలా అందరూ అద్భుతంగా నటించారు. ఏప్రిల్ 11న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా అందరూ చూడాలని కోరుతున్నాను అని తెలిపారు. నిర్మాత రత్నాకర్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ చిత్రాన్ని స్వామి పట్నాయక్ అద్భుతంగా తెరకెక్కించారు. అందరూ థియేటర్లలో ఈ సినిమాను చూసి సక్సెస్ చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో రాజేష్, నటుడు ఆర్కే నాయుడు, నటి మనీషా, లోహిత్, చంటి, కెమెరామ్యాన్ యోగిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్, మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ రాజ్ తేలు వంటి వారంతా ప్రసంగించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు