Mohan Babu: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ట్రోల్ అయ్యే ఫ్యామిలీ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ‘మంచు ఫ్యామిలీ’ (Manchu Family). ట్రోలర్స్‌పై ఈ మధ్య మంచు విష్ణు వార్ కూడా ప్రకటించారంటే ఆ ఫ్యామిలీని ట్రోలర్స్ ఎంతగా డిస్టర్బ్ చేస్తుంటారో అర్థం చేసుకోవచ్చు. అయితే అసలు ట్రోలింగ్‌లనే పట్టించుకోనని అంటున్నారు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu). తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాల గురించి చెప్పుకొచ్చారు. అందులో ఒకటి ట్రోలింగ్.
వాస్తవానికి ఈ మధ్య మంచు ఫ్యామిలీ ఎలా వార్తలలో నిలిచిందో తెలియంది కాదు. దాదాపు రెండు మూడు నెలలు పాటు వారి ఇంట్లో గొడవలు రచ్చ రచ్చగా జరిగాయి. మంచు మనోజ్ (Manchu Manoj) ప్రతి విషయాన్ని పబ్లిక్‌కి తీసుకొచ్చేయడంతో మోహన్ బాబుకి పరువు పోయినంత పనైంది. అయినా కూడా నిబ్బరంగా నిలబడి, మళ్లీ తన ఫ్యామిలీని దారిలోకి తెచ్చుకునేందుకు మోహన్ బాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
Also Read- Kousalya Tanaya Raghava: సీత ప్రేమలో రాముడు పడితే.. సందేశాత్మక కలియుగ రామాయణం
ప్రస్తుతం ఆ ఇంటిలో గొడవ సద్దుమణిగినట్లుగానే చెప్పుకోవచ్చు. దీంతో, ప్రస్తుతం ఆ ఫ్యామిలీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘కన్నప్ప’ చిత్ర ప్రమోషన్స్‌పై వారంతా దృష్టి పెట్టారు. అందులో భాగంగానే మోహన్ బాబు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ.. అసలు ట్రోలింగ్‌లను పట్టించుకోనని చెప్పారు. పక్కవారు నాశనం అయితే చూడాలనుకునేవారే అలాంటి ట్రోల్స్‌కు తెగబడుతుంటారని అన్నారు. అలా ఎవరి గురించి, ఎవరి నాశనాన్ని కోరుకోకూడదని, అలా కోరుకుంటే వాళ్లకంటే ముందు మనమే నాశనమవుతామని కలెక్షన్ కింగ్ చెప్పుకొచ్చారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఒకరిని మార్చాలని మనమెప్పుడూ భావించకూడదు. అందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించాలి. ట్రోలింగ్ వల్ల చేసే వారికి ఏం ఆనందం వస్తుందో నాకయితే ఇప్పటికీ తెలియలేదు. నేను ఈ విషయంలో ఎవరినీ నిందించను కూడా. దేవుడి దయతో ‘కన్నప్ప’ సినిమా చేసుకుంటున్నాను. ‘కన్నప్ప’ సినిమా దేవుని ఆశీస్సులతోనే పూర్తయిందని మోహన్‌బాబు పేర్కొన్నారు.
Also Read- Jr NTR: ‘కంత్రీ’ లుక్.. ‘మ్యాడ్ స్క్వేర్’ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ని చూసి ఫ్యాన్స్ షాక్!
ఇంకా ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా గురించి చెబుతూ.. ఆ సినిమా కోసం ఆస్తులన్నీ తాకట్టు పెట్టినట్లుగా చెప్పుకొచ్చారు. అన్నగారు ఎన్టీఆర్ వద్దని వారిస్తున్నా, ఆయనతో సినిమా చేయడం కోసం ఆస్తులన్నీ తాకట్టు పెట్టి మరి సక్సెస్ కొట్టానని మోహన్ బాబు అన్నారు. తన బ్యానర్‌ను నందమూరి తారక రామారావు స్థాపిస్తే, నారా చంద్రబాబు నాయుడు సంస్థ ప్రారంభోత్సవానికి క్లాప్ కొట్టారని గుర్తు చేసుకున్నారు. తనకి అవకాశం ఇచ్చిన గురువు దాసరి నారాయణ రావుని ఎప్పటికీ మరిచిపోలేనని, ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని తెలిపారు. ఇక ట్రోలింగ్‌పై మోహన్ బాబు చెప్పిన మాటలను విన్నవారంతా.. ‘అబ్బ ఏం చెప్పారు సార్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు