CM Chandrababu (image credit:Twitter)
ఆంధ్రప్రదేశ్

CM Chandrababu: చంద్రబాబుపై భువనమ్మకు కంప్లైంట్.. చేసింది ఎవరో కాదు.. ఆ మంత్రే!

CM Chandrababu: సీఎం చంద్రబాబుపై ఓ మంత్రి నేరుగా ఆయన సతీమణి నారా భువనేశ్వరికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు భువనమ్మ రెస్పాండ్ ఎలా అవుతారన్నదే ఇప్పుడు పెద్ద చర్చ. ఇంతకు కంప్లైంట్ చేసింది ఎవరో కాదు.. సీఎం చంద్రబాబు మంత్రివర్గంలోని ఓ మహిళా మంత్రి. ఇంతకు చంద్రబాబు చేసిందేమిటి? అసలు జరిగిందేమిటి? తెలుసుకుందాం.

నందిగామ నియోజకవర్గం, ముప్పాళ్లలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రజల్ని ఉద్దేశించి సీఎ చంద్రబాబు ప్రసంగించారు. అలాగే రోజువారీ తన పర్యటనలో పేద ప్రజల గడప తొక్కి వారి సమస్యలు పరిష్కరించే సీఎం చంద్రబాబు యధావిధిగా ఓ ఇంటికి వెళ్లారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు, పేదలకు ఆర్థిక చేయూత అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో భాగంగానే నిరుపేద ఇంటికి సీఎం చంద్రబాబు వెళ్లి ఆ కుటుంబ సభ్యులకు స్వయంగా కాఫీ అందించారు. వారితో పి-4 కార్యక్రమం గురించి వివరించి ఆ కుటుంబ అభివృద్ధి బాధ్యతలు తీసుకున్న మార్గదర్శిని వారికి పరిచయం చేసారు. దీనితో ఆ కుటుంబ ఆనందానికి అవధుల్లేవు. అయితే సీఎం చంద్రబాబుతో ఈ కార్యక్రమంలో హోమ్ మంత్రి వంగలపూడి అనిత కూడా పాల్గొన్నారు.

సీఎం చంద్రబాబు స్వయంగా తయారు చేసిన కాఫీని కుటుంబ సభ్యులతో పాటు మంత్రి అనిత కూడా తాగారు. ఇక్కడే పెద్ద చిక్కు వచ్చింది సీఎం చంద్రబాబుకు. అలా చంద్రబాబు స్వయంగా చేసిన కాఫీ తాగిన మంత్రి అనిత ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏమిటంటే.. అమ్మా.. భువనమ్మా.. 44 ఏళ్ల మీ వైవాహిక జీవితంలో మా అధినాయకుడు చంద్రబాబు, మీకోసం ఏరోజైనా ఇలా స్వయంగా టీ పెట్టి ఇచ్చారా? ప్రజల మనిషి మీ తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్.. ప్రగతి మనిషి మీ జీవితభాగస్వామి సీఎం చంద్రబాబు, ఇప్పుడు మీ ఒక్కగానొక్క బిడ్డ, భావితరపు యువనేత నారా లోకేష్ మీ త్యాగానికి ధన్యోస్మి అంటూ ట్వీట్ చేశారు.

అలాగే చంద్రబాబు స్వయంగా తయారుచేసిన టీ తాగడంలో మాత్రం ప్రజలతో పాటు నేనూ కూడా లక్కీ అంటూ మరో ట్వీట్ కూడా చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా దర్పం లేకుండా పేద దళిత కుటుంబం ఇంటికి స్వయంగా వచ్చి గర్వంలేకుండా వారి బాగోగులు తెలుసుకుంటూ స్వయంగా తన చేత్తో టీ పెట్టి వారితో కలిసి ముచ్చటించి తండ్రిలా నేనున్నాంటూ అండగా నిలబడడం నభూతో నభవిష్యత్ అంటూ సీఎం చంద్రబాబును కొనియాడారు.

తర్వాత వచ్చే ఎన్నికల గురించి ఆలోచించే రాజకీయ నాయకులను ఎందరినో చూశాం. కానీ.. తరతరాల భవిష్యత్‌ను గురించి తపించే దార్శనికుడిని కళ్లారా చూడడం, ఆయనతో కలిసి భాగస్వామ్యమవడం నిజంగా నాకు దొరికిన భాగ్యమేనంటూ మంత్రి ట్వీట్ చేశారు. ఇక్కడే ఓ లాజిక్ ను తెలుగు తమ్ముళ్లు సరదాగా లేవనెత్తుతున్నారు.

Also Read: SBI PO prelims result 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫలితాలు విడుదల.. చెక్ చేసుకున్నారా?

మన బాస్ చేసిన కాఫీ తాగి, ఏకంగా భువనమ్మకు ఏనాడైనా కాఫీ చంద్రబాబు చేసి ఇచ్చారా అంటూ ట్వీట్ చేయడంపై, భువనమ్మ రెస్పాండ్ ఎలా ఉంటుందోనని క్యాడర్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద తమ బాస్ ను భువనమ్మ వద్ద మంత్రి అనిత ఇరకాటంలో నెట్టేశారని కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా సీఎం చంద్రబాబు ప్రతి కుటుంబాన్ని పలకరించిన సమయంలో కాఫీ చేసి ఇవ్వడం విశేషంగా చెప్పవచ్చు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?