వనపర్తి స్వేచ్ఛ: Wanaparthy district: వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆసీస్ ట్రేడర్స్ ప్రభుత్వానికి అప్పగించాల్సిన వరి ధాన్యం మాయం కావడం కలకలం రేపుతోంది. 2021-22 ఖరీఫ్ , 2022-23 ఖరీఫ్ 62 ఏసికలు పెండింగ్లో ఉన్నాయి. మొత్తంగా 82 ఏసీకేలా పైగా పెండింగ్లో ఉన్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. దీని విలువ 8 కోట్ల 65 లక్షల రూపాయలు విలువైనటువంటి ధాన్యం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ మిల్లులో ధాన్యం లేకపోవడంతో ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది.
సివిల్ సప్లై డీటీలు ప్రతిరోజు పర్యవేక్షించాల్సిన డి టి లు అధికారులు, పర్యవేక్షణ కరువైందని వారికి అందాల్సివి అందకపోతే తప్ప పర్యవేక్షణ చేస్తారు అని నిదర్శనంగా కనిపిస్తుంది. ప్రభుత్వ ధాన్యం మిల్లు చేతికి చిక్కిందన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. ప్రభుత్వం వరి ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించి బియ్యం మడారించి తిరిగి ప్రభుత్వ నిధుల్లో జమ చేయాల్సి ఉంటుంది. కానీ వనపర్తి ఆసీస్ ట్రేడర్స్ వరి ధాన్యం లేకుండా పోవడంతో అధికారుల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: BRS Party: బీఆర్‌ఎస్ తో టచ్ లో ఆ ఎమ్మెల్యేలు? కేసీఆర్ ఓకే చెప్పేనా?
ప్రధాన పాత్రధారులుగా ఉన్న బాధ్యుడు, 6 రైస్ మిల్లులు, బినామీల పేర్లతో ఉన్నట్లు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. వనపర్తి జిల్లా పరిధిలో 5 మిల్లులు, మరో మిల్లు పక్క జిల్లాలో ఒక్క మిల్లు ఉన్నట్లు తేలుస్తుంది. అధికారుల కనుసన్నల్లోనే ధాన్యాన్ని బయటకు తరలించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం వనపర్తి జిల్లాలో కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి ధాన్యం మిల్లులలో మాయమైనట్లు తెలుస్తుంది. అయినా ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం స్థానికులను ఆశ్చర్యంలో గురిచేస్తుంది.
ధాన్యం ఎక్కడికి వెళ్లింది? అనేదానిపై ఇప్పటివరకు ఆసీస్ మిల్లుల్ని తనిఖీ చేసిన అధికారులు గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు చర్యలు తీసుకొని సివిల్ సప్లై అధికారులకు ఒత్తిడి తెస్తే తప్ప వనపర్తి జిల్లాలో 8 కోట్ల విలువైనటువంటి వరి ధాన్యం ఎక్కడికెళ్ళిందో అర్థం కాని పరిస్థితి, ఇప్పటికే వనపర్తి జిల్లాలో 27 మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినప్పటికీ వారు 27 మందిని అరెస్టు చేసిన దాఖలాలు లేవు.
డీఎస్ఓ కాశీ విశ్వనాథ కు ఫొన్లో వివరణ అడుగుదామని ప్రయత్నం చేయడంతో ఆయన ఫోన్ కు స్పందనలేదు. డిఎం జగన్మోహన్ వివరణ కోరగా మాకు డీఎస్ఓ నుంచి ఆసీస్ ట్రేడర్స్ పై ఎలాంటి నివేదిక రాలేదని ఆయన తెలిపారు. దాన్యం లేదని నివేదిక ఇచ్చినట్లయితే వెంటనే కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/