Pamban Bridge (Image Source: Twitter)
జాతీయం

Pamban Bridge: పంబన్ వంతెన లాంచ్ కు రంగం సిద్ధం.. ప్రత్యేకతలు తెలిస్తే మతిపోవాల్సిందే!

Pamban Bridge: దేశంలో మరో ప్రతిష్టాత్మక పంబన్ బ్రిడ్జి (Pamban Bridge) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi).. ఈ వంతనెను ప్రారంభించనున్నారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో నిర్మించిన ఈ వంతెన కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.535 కోట్లు ఖర్చు చేసింది.  ఆధునాతన సాంకేతిక విధానంతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది. అంత ఖర్చు పెట్టి నిర్మించిన ఈ వంతెన ప్రత్యేకతలు ఏవి? దేశంలోని వంతెనలతో దానిని వేరు చేస్తున్న ముఖ్య విషయం ఏంటి? అన్నది ఈ కథనంలో పరిశీలిద్దాం.

వంతెన ప్రత్యేకతలు ఇవే!

❄️ తమిళనాడు (Tamilnadu)లోని మండపం ప్రాంతం నుంచి పంబన్‌ దీవిలోని రామేశ్వరం (Rameshwaram) వరకు 2.10 కిలోమీటర్ల పొడవున ఈ బ్రిడ్జిని నిర్మించారు.

❄️ ప్రధాని మోదీ ఈ రైల్వే వంతెనను ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. రామేశ్వరం-తంబరం మధ్య కొత్త రైలు సర్వీసుకు ఫ్లాగ్ ఊపడం ద్వారా ప్రధాని మోదీ ఈ బ్రిడ్జిపై రైళ్ల రాకపోకలకు శ్రీకారం చుట్టనున్నారు.

❄️ వాస్తవానికి పంబన్ బ్రిడ్జి కొత్తగా నిర్మించింది కాదు. 1915లో బ్రిటిష్ కాలంలో నిర్మించిన పాత బ్రిడ్జి స్థానంలో ఇది రూపొందింది. అది ప్రమాదకరంగా మారడంతో దాని స్థానంలో కొత్త దానిని రూపొందించారు.

❄️ ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ.. రామేశ్వరం ఆలయాన్ని (Rameshwaram Temple) సందర్శిస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

❄️ పాత బిడ్జి స్థానంలో ఈ కొత్త వంతెనకు ప్రధాని మోదీ..  2019 నవంబర్ లో శంకుస్థాపన చేశారు. రైల్ వికాస్ నిగం లిమిటెడ్ (Rail Vikas Nigam Limited) సంస్థ ఈ వంతెనను నిర్మించింది. వంతెన నిర్మాణం కోసం రూ. 535 కోట్లు ఖర్చు అయ్యాయి.

❄️ పంబన్ వంతెన ప్రత్యేకత విషయానికి వస్తే.. ఈ బ్రిడ్జి వర్టికల్ గా 72.5 మీటర్లు పైకి లేచే గుణాన్ని కలిగి ఉంది. 22 మీటర్ల ఎత్తు వరకూ లేచి నౌకలకు దారి ఇస్తుంది.

❄️ పంబన్ బ్రిడ్జి నిర్మాణానికి ఐఐటీ చెన్నై, ఐఐటీ బాంబే సాంకేతిక సాయాన్ని అందించాయి. కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో ఈ బ్రిడ్జి పనిచేసేలా ప్లాన్ ను డిజైన్ చేసి ఇచ్చాయి.

❄️ నౌకలు వంతెనను క్రాస్ చేసిన తర్వాత తిరిగి యథాస్థితిలోకి బ్రిడ్జి వచ్చేస్తుంది. వర్టికల్ లిఫ్ట్ మెకానిజం కారణంగా దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా ఈ బ్రిడ్జ్ ప్రత్యేకత సంతరించుకుంది.

❄️ పంబన్ బ్రిడ్జికి మరో ప్రత్యేక ఉంది. తమిళనాడులోని రామేశ్వరం ద్వీపాన్ని భారత భూభాగంతో రైలు మార్గం ద్వారా కలిపే వంతెన ఇదే. సముద్రం మధ్యలో నిర్మించిన ఈ వంతెన ఇంజనీరింగ్ అద్భుతానికి ఉదాహరణగా చెబుతుంటారు.

❄️ వాస్తవానికి ఈ బ్రిడ్జి నిర్మాణం 2024 నవంబర్ లోనే పూర్తయింది. అయితే శ్రీరామనవమి (Sri Rama Navami) సందర్భంగా దీనిని ప్రారంభించాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగా నరేంద్ర మోదీ ఈ వంతెనను ప్రారంభించబోతున్నారు.

❄️ ఈ బ్రిడ్జిని పూర్తిగా స్టెయిన్ లెస్ స్టీల్ (Stainless Steel) తో చాలా దృఢంగా నిర్మించారు. అన్ని కాలాల్లోనూ స్టీల్ దెబ్బతినకుండా ఉండేందుకు వంతెనకు పాలిసిలోక్సేన్ పూత (polysiloxane coating) పూశారు.

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు