Ap Mega DSC Image Source Twitter
ఆంధ్రప్రదేశ్

Ap Mega DSC: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. మెగా డీఎస్సీ పై బిగ్ అప్డేట్

Ap Mega DSC: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరో వారంలోగా.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ రిలీజ్ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఎస్సీ వర్గీకరణ రోస్టర్‌ పాయింట్లపై గవర్నర్‌ ఆమోదంతో జారీ అయ్యే ఆర్డినెన్స్‌ ఆధారంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయనున్నారు. వర్గీకరణ ఆర్డినెన్స్‌ కోసం ప్రభుత్వం చురుకుగా పని చేయనుంది. మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించిన ఫైలు రాజ్‌భవన్‌కు పంపుతారని తెలుస్తోంది.

Also Read:  Alekhya Chitti Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్ మరో వీడియో లీక్.. ఈ సారి మరి బాబోయ్..

ఆర్డినెన్స్‌ జారీ అయ్యాక.. సాధారణ పరిపాలన శాఖ రిజర్వేషన్లపై కొత్త రోస్టర్‌ రిలీజ్ చేయనుంది. తర్వాత ఉపాధ్యాయ పోస్టులు కేటాయించి, డీఎస్సీ నోటిఫికేషన్‌ రిలీజ్ చేస్తారు. రోస్టర్‌ పాయింట్లు విడుదలైన మరుసటి రోజు లేదా ఆ తర్వాత రోజు డీఎస్సీ నోటిఫికేషన్‌ రిలీజ్ చేస్తారు. ముందు మాట ఇచ్చిన ప్రకారం, 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తారు. కాగా, ఎంతో మంది నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం చాలా రోజుల నుంచి వేచి చూస్తున్నారు.

Also Read: Sampoornesh Babu: 8 ఏళ్ళ తర్వాత బిగ్ బాస్ గురించి అసలు నిజం చెప్పిన సంపూర్ణేష్ బాబు

మొత్తం పోస్టుల్లో ప్రిన్సిపల్‌ పోస్టులు 52, పీఈటీలు 132, టీజీటీలు 1781, పీజీటీలు 286, ఎస్‌జీటీలు 6,371, స్కూల్‌ అసిస్టెంట్లు 7,725, పోస్టులు ఉన్నాయి. ఇటీవలే అసెంబ్లీలో త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని మంత్రి లోకేష్‌ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా 16వేలకు పైగా పోస్టులు ప్రకటించడంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!