Narsampet: యథేచ్చగా మట్టి దందా కొనసాగుతోంది. అనధికార క్వారీలు, చెరువుల్లో తవ్వ కాలు చేసి అక్రమంగా మట్టిని విక్రయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. చెరువులను చరబట్టుతూ మట్టి తవ్వకాలు చేస్తున్నారు. అక్రమంగా మొరం పట్టణం, గ్రామాల్లోని ప్లాట్లు, ఇండ్ల నిర్మా ణానికి , రియల్ ఎస్టేట్ స్థలాలకు యథేచ్చగా తరలిస్తున్నారు.
ప్రతి వేసవి కాలంలో మొరం వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కళ్ళ ముందే ఇంత దందా జరుగుతున్న కూడా సంబంధిత అధికారులు చూసి చూడ నట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిత్యం పోలీస్ స్టేషన్ ఎదుట నుంచే రాత్రింబవళ్లు మట్టిని తరలిస్తున్నారు.
డివిజన్లో మట్టి వ్యాపారం…
నర్సంపేట నియోజకవర్గంలోని నర్సంపేట పట్టణం, నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లోని గ్రామాలలో మట్టి వ్యాపారం కొందరు వ్యా పారులు జోరుగా సాగిస్తున్నా రు. అనధికారికంగా క్వారీలను నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయా నికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ స్థ్థలాలలో, లావాని పట్టా భూముల్లో, ప్రభుత్వ అసైన్ భూముల్లో, ప్రభుత్వ గుట్టల నుంచి, చెరువుల శిఖం, ల నుంచి అక్రమంగా మట్టిని యథేచ్చగా తవ్వుతు న్నారు.
జెసిబి, ట్రాక్టర్లు మినీ లారీల, డీసీఎంల సహాయంతో మట్టి తవ్వకాలు చేసి తరలిస్తు న్నారు. ఇక్కడ తవ్విన మట్టిని వ్యాపారులు అక్రమంగా ట్రాక్టర్కు వెయ్యి చొప్పున మట్టికి వసూలు చేస్తూ అమ్మ కాలు కొనసాగిస్తున్నారని ఆరోప ణలు వస్తున్నాయి. ట్రాక్టరు, డీసీఎం, లారీ, మీనీ లారీలకు ఒక రేటు చొప్పున నిర్ణయిస్తూ, దూరాన్ని బట్టి డబ్బులు నిర్ణ యిస్తూ తీసుకుంటు న్నారు.
Also read: Indian Navy: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. వెంటనే, ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి!
రాత్రింబ వళ్లు మట్టిని తరలి స్తున్నారు. వేసవికాలం లో రహదారులు, క్వారీలలో ఇబ్బందులు ఉండకపోవ డంతో వ్యాపారులు ఇదే అదు నుగా తీసుకొని దందాను కొన సాగిస్తున్నారు. వర్షాకా లంలో రాకపోకలకు వాహనాల కు కష్టం అవడంతో వేసవి కాలం లోనే ఈ వ్యాపారం కొనసా గుతున్నది. రాత్రులు మట్టి తరలించడం వల్ల కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అభ్యం తరాలు చెబుతున్నారు.
రాత్రిలలో తరలించడం వల్ల వాహనాల రాకపోకల శబ్దం వల్ల నిద్ర ఉండడం లేదని ప్రజలు ఆరోపి స్తున్నారు. గత కొన్ని నెలల కిందట ఎస్సీ కాల నీలో రాత్రి మట్టిని రాత్రిళ్ళు త రలిస్తుండగా అడ్డుకున్న సంఘ టనలు కూడా ఉన్నాయి.
పట్టించుకునే వారేరి…
కళ్ళ ముందు జరుగుతున్న మట్టి దందాను అడ్డుకునే వా రు కనిపించడం లేదని ఆరో పణలు వస్తున్నాయి. అక్రమం గా మట్టిని తరలిస్తు న్నప్పటికీ కూడా మైనింగ్ శాఖ అధికారు లు పట్టింపు లేకుండా వ్యవహ రిస్తున్నారని ఆరోప ణలు వస్తు న్నాయి.
రెవెన్యూ అధికారులు కూడా అక్రమంగా తవ్వకాలు జరిపి మట్టిని తర లిస్తున్న వారిపై చర్యలు తీసు కోవడం లేదని అంటున్నారు. నిత్యం పోలీస్ స్టేషన్ నుంచి వాహనా లు వస్తున్నప్పటికీ కూడా పోలీ సులు పట్టుకోవడం లేదనే ఆరో పణలు వస్తున్నాయి. పట్టణాల నుంచి గ్రామాలకు మట్టి తరలు తున్నది.
అధికారులు మా మూళ్ల మత్తులో మునిగిపోవ డం వల్లే చర్యలు తీసుకోవ డం లో చూసి చూడనట్టు వ్యవహ రిస్తున్నారని ప్రచారం జరుగు తున్నది. చెరువులు, ప్రభుత్వ స్థలాలు ధ్వంసం చేస్తున్న ప్పటి కీ కూడా చర్యలు తీసుకోవడం లేదు. అక్రమ మట్టి క్వారీల వల్ల ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతున్నది. వీరి నుంచి రాయల్టీ రూపంలో కూడా వసులు కావడం లేదు. దీంతో ప్రభుత్వానికి నాయా పైసా రావడం లేదు. ఇప్పటికైనా అధికారులు అక్రమ దందాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరు తున్నారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/