Super Star Mahesh Babu with Passport
ఎంటర్‌టైన్మెంట్

Mahesh Babu: మహేష్‌ చేతిలో పాస్‌పోర్ట్.. అప్పుడే జక్కన్న వదిలేశాడా? మీమ్స్ చూశారా!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడు విడుదల అవుతుందో తెలియదు కానీ, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మాత్రం కామ్‌గా జరిగిపోతుంది. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా చాలా సైలెంట్‌గా జక్కన్న ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. అయినా కూడా కొన్ని లీక్స్‌తో ఆయన దాచాలనుకున్న విషయాలు తెలిసిపోతున్నాయి. అసలు రాజమౌళితో సినిమా అంటే, సినిమా ప్రారంభానికి ముందు ఉండే కసరత్తులు, కత్తి ఫైట్లు మాములుగా ఉండవు. షూటింగ్‌కు ముందు చేసే వర్క్‌తోనే హీరోలకు చుక్కలు కనబడుతుంటాయి.

ఆ విషయం ‘బాహుబలి’ (Bahubali) విషయంలోనూ, అలాగే ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) విషయంలోనూ అందరికీ తెలిసి వచ్చింది. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను జక్కన్న ఎంతగా టార్చర్ పెట్టాడో.. వారే సరదాగా కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహేష్ వంతు వచ్చింది. వాస్తవానికి మహేష్ బాబుతో రాజమౌళి (SS Rajamouli) సినిమా అని అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడే, అసలు ఇది వర్కవుట్ అవుతుందా అనేలా అనుమానాలు వచ్చాయి. ఎందుకంటే, గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీతో ప్రపంచయాత్రకు వెళ్లే మహేష్, జక్కన్న రూల్స్‌ని తట్టుకోగలడా? అనేలా అనుమానాలు వచ్చాయి.

Also Read- Trivikram Srinivas: త్రివిక్రమ్ చెప్పిన ‘జై ఎన్టీఆర్’ మీనింగ్ ఇదే.. ఇక ఫ్యాన్స్‌ని ఆపతరమా?

ఆ అనుమానాలన్నింటికీ తెరదించుతూ సినిమా అయితే ప్రారంభమైంది. మహేష్ బాబు అయినా సరే జక్కన్న రూల్స్‌లో నో ఛేంజ్ అనేలా.. సినిమా ప్రారంభానికి ముందే మహేష్ బాబు పాస్‌పోర్ట్‌ (Mahesh Babu Passport)ని సీజ్ చేసినట్లుగా ఓ పిక్ వైరల్ అయిన విషయం తెలిసిందే. సింహాన్ని చూపిస్తూ.. పాస్‌పోస్ట్ సీజ‌్‌డ్ అనేలా జక్కన్న పెట్టిన పిక్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. కానీ ఇప్పుడు పాస్‌పోర్ట్ తిరిగి మహేష్ బాబు చేతుల్లోకి వచ్చేసింది.

నా పాస్‌పోర్ట్ నా చేతుల్లోకి వచ్చేసిందని తెలిపేలా తాజాగా మహేష్ బాబు తన పాస్‌పోర్ట్‌ని చూపిస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. మరీ షూటింగ్ గ్యాప్ వచ్చిందో, లేదంటే ప్రస్తుతం మహేష్‌కు గ్యాప్ ఇచ్చాడో తెలియదు కానీ.. మహేష్ బాబు చేతుల్లో పాస్‌పోర్ట్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఇక ఈ పాస్‌పోర్ట్ వీడియోపై మామలుగా మీమ్స్ పడటం లేదు. జక్కన్న కూడా మహేష్ బాబు దెబ్బకి రూల్స్ మార్చుకోక తప్పలేదు అనేలా కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మీమర్స్ మాత్రం మస్త్ ఎంజాయ్ చేసేలా మీమ్స్‌ని వదులుతున్నారు.

Also Read- Priyanka Chopra: మరో టాలీవుడ్‌ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. నిజమైతేనా?

‘నా పాస్‌పోర్ట్ నాకు వచ్చేసింది.. ఇంక నన్నెవరూ ఆపలేరు’, ‘మొత్తానికి బాబు చేతుల్లోకి పాస్‌పోర్ట్ వచ్చేసింది. సాధించాడు’, ‘బిగ్ డేస్‌కి ముందు హాలీడే సాధించాడు’ అంటూ మీమర్స్‌ డ్యూటీ ఎక్కేశారు. ఈ మీమ్స్‌తో ప్రస్తుతం SSMB29 హ్యాష్‌ట్యాగ్ (#SSMB29) టాప్‌లో ట్రెండ్ అవుతోంది. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నట్లుగా అధికారికంగా తెలిసింది. అంతే, అంతకుమించి ఏ ఇతర న్యూస్ ఈ సినిమా గురించి బయటకు రాలేదు. కనీసం షూటింగ్ అప్‌డేట్స్ కూడా చెప్పకుండా, కామ్‌గా జక్కన్న తన పని తను కానిచ్చేస్తున్నాడు. ఇతర డైరెక్టర్స్‌తో స్టార్ హీరోలు సినిమాలు చేసేటప్పుడు.. అప్డేట్ అంటూ రచ్చ రచ్చ చేసే ఫ్యాన్స్ కూడా ఈ సినిమా విషయంలో అప్డేట్ అడగకుండా కామ్‌గా ఉండటం విశేషం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?