Trump Tariffs Image Source Twitter
ఆంధ్రప్రదేశ్

Trump Tariffs: ట్రంప్ దెబ్బకు ఆంధ్రా రొయ్యల ధరలు ఢమాల్..

Trump Tariffs: గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ట్రంప్ పేరు బాగా వినబడుతోంది. ఎందుకంటే, రోజుకో రకంగా అందర్ని భయపెడుతున్నాడు. దేశం , దేశం అని తేడా లేకుండా అందరి మీద సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే మన దేశం పై 26 శాతం సుంకాలు విధించాడు. మనదేశం నుంచి యునైటెడ్ స్టేట్స్ కు కోట్ల రూపాయల సముద్ర ఆహారం ఎగుమతి చేస్తుంది. ఇప్పుడు, వీటిని కూడా వదిలేలా లేడు. 27.83 శాతం సుంకాలు అమలు చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Also Read:  Hyderabad Cyber ​​Crime Police: సైబర్ క్రిమినల్స్ బారిన పడ్డారా?.. గంటలోనే ఫిర్యాదు చేయండి.. డీసీపీ కవిత

దీంతో, అమెరికాలో రొయ్యల ధర ఆకాశాన్ని అంటింది. భారత్ నుంచి ఎగుమతులు తగ్గే అవకాశం ఉండడంతో మన దగ్గర రొయ్యల రేట్లు భారీగా తగ్గుతాయి. దీంతో, బిజినెస్ చేసే వారి ఆదాయం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి నుంచే ప్రభావం చూపిస్తుంది. ఆంధ్రాలో రొయ్యలు బిజినెస్ చేసే లబో దిబో అంటున్నారు.

Also Read:   Sri Rama Navami: భద్రాద్రిలో ముమ్మరంగా శ్రీరామనవమి ఏర్పాట్లు.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో కేజీ రొయ్యల ధర రూ.40 కి పడిపోయింది. మనదేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే మాంస ఉత్పత్తుల్లో రొయ్యలు మూడో స్థానంలో ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎక్కువగా మొత్తం 1.20 లక్షల ఎకరాల్లో రొయ్యలను పెంచుతున్నారు.

Also Read:   Viral: బస్సు ఆరడుగులు.. కండక్టర్ ఏడడుగులు.. షాక్ అవుతున్న ప్రయాణికులు?

జిల్లాలో ప్రతి ఏటా 4 లక్షల టన్నుల ఉత్పత్తి అవుతున్నాయి. వాటిలో 3.5 లక్షల టన్నులు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అమెరికా ప్రతీకార సుంకాలు రొయ్యల మీద కూడా పడింది. రెండు రోజుల క్రితం రొయ్య ధర కిలో రూ.240 గా ఉంది. ఆ తర్వాత రోజే రూ.150 కి పడిపోయింది. 40, 30, 20 కౌంట్లు ఉండే రొయ్యలనే అమెరికాకు పంపుతారు. ట్రంప్‌ విధించిన పన్నులను చూపిస్తూ కేజీకి రూ.25-35 వరకు తగ్గించడంతో వ్యాపారులు నిరాశ చెందుతున్నారు.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్