Telangana: రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు గొప్ప శుభ వార్త చెప్పింది. రాష్ట్రంలో కొత్త పోస్టులు మంజూరు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. తెలంగాణలోని నివసించే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళను అందివ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మొదటి విడత ప్రభుత్వం 72వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. అయితే, వారిలో 12 వేల మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని మొదలు పెట్టారు. ఇప్పటికి 500 మంది బేస్మెంట్ పనులు పూర్తి చేశారు. బేస్మెంట్ స్థాయి అయిపోయిన వెంటనే రూ.లక్ష రూపాయలను లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
Also Read: Sampoornesh Babu: 8 ఏళ్ళ తర్వాత బిగ్ బాస్ గురించి అసలు నిజం చెప్పిన సంపూర్ణేష్ బాబు
మొదటి దశలో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేయాలంటే అసిస్టెంట్ ఇంజనీర్లు చెక్ చేసి బేస్మెంట్ పనులు కంప్లిట్ అయ్యాయని సర్టిఫై చేయాల్సి ఉంటుంది. అయితే, తాజాగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించే బాధ్యత ప్రైవేట్ ఇంజనీర్లకు ప్రభుత్వం అప్పగించేందుకు సిద్ధమవుతోంది.
Also Read: Commissioner Sunpreet Singh: గంజాయి మూలాల డొంకలు పట్టండి.. కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
ప్రస్తుతం 390 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నెల 11వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు ఔట్ సోర్సింగ్ పద్దతిలో పనిచేయాల్సి ఉంటుంది. వీరితో ఒక ఏడాది పాటు ఒప్పందం చేసుకోనున్నారు. ప్రతి నెల వారికి రూ.33,800 జీతాన్ని చెల్లించనున్నట్లు తెలుస్తోంది. సివిల్ ఇంజనీరింగ్ చేసి 44 ఏళ్ల లోపు ఉన్న వారు ఈ ఉద్యోగానికి అర్హులు.