IPL 2025 Image Source Twitter
స్పోర్ట్స్

IPL 2025: చెన్నై ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్ .. కెప్టెన్ గా ధోని?

IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్యాన్స్ లో ఎంత క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీమ్ లో అందరికి నచ్చే ఫేవరెట్ ప్లేయర్ ఎవరంటే వెంటనే చెప్పే పేరు ధోనీ. ముద్దుగా అందరూ తలా ధోనీ అని పిలుచుకుంటారు. చూడటానికి మిస్టర్ కూల్ గా ఉంటాడు.. కానీ, ఒక్కసారి క్రీజులో దిగాక అతన్ని ఆపడం చాలా కష్టం.ఇప్పటికి చాలా మంది ధోని ఆటను చూడటానికి క్రికెట్ స్టేడియంకు వెళ్తారు. ఇంతక ముందు చెన్నై జట్టుకు వికెట్ కీపర్, బ్యాటర్ ఉంటూ జట్టు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు.  2023 వరకు ధోని కెప్టెన్ గా భాద్యతలు తీసుకుని ఛాంపియన్ ట్రోఫీలు అందించాడు. ఇలా ఇప్పటికి చెన్నై ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెల్చుకుంది. ఒక్క మహీ వల్లే ఇది సాధ్యమైంది. ఆ తర్వాత నుంచి చెన్నై టీమ్ కు రుతురాజ్ కెప్టెన్ గా ఉన్నాడు.

Also Read: Bird Flu in Batasingaram: ఆందోళనలో కోళ్ల ఫామ్ నిర్వాహకులు…కోట్లలో ఆస్తి.. యజమానుల ఆవేదన!

అయితే, గత రెండేళ్ళ నుంచి ధోనీ కీపింగ్ చేస్తూ బ్యాటర్ గా ఆడుతున్నాడు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ఆరు లేదా ఏడో స్థానంలో క్రీజులోకి దిగుతున్నాడు. 2025 ఐపీఎల్ సీజన్లో చెన్నై మూడు మ్యాచ్ లు ఆడగా .. రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. నేడు నాలుగో మ్యాచ్ ఢిల్లీ క్యాప్టిల్స్ తో చెన్నై తలపడనుంది. రోజు మధ్యాహ్నం 03:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ మ్యాచ్ లో మళ్ళీ తలా కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

హోమ్ గ్రౌండ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ్ ను ధోనీ ముందుండి నడిపించనున్నాడు. ఎందుకంటే, రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో అతను ఇంకా కోలుకోలేదు. చెపాక్‌ స్టేడియంలో అతడి ఫిట్‌నెస్‌ను చూసి

Also Read:  Sri Rama Navami: భద్రాద్రిలో ముమ్మరంగా శ్రీరామనవమి ఏర్పాట్లు.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

ఆడతాడా.. లేదనేది.. మ్యాచ్‌ ఆడే సమయంలో నిర్ణయం తీసుకుంటామని సూపర్ కింగ్స్ బ్యాటింగ్ జట్టు మైఖేల్ హస్సీ వెల్లడించారు. ఒకవేళ రుతురాజ్‌ ఆడకపోతే.. తర్వాత కెప్టెన్‌గా ఎవరికి అవకాశం ఇస్తారని అడగగా.. స్టంప్స్‌ వెనుకాల బాగా ఆడే ఓ ‘వ్యక్తికి ’ అంటూ హింట్‌ ఇవ్వడంతో .. అది ధోని అనే తెలుస్తోంది. కాబట్టి, ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పుకోవాలి. ఇదే నిజమైతే చాలా రోజుల తర్వాత ధోనీని కెప్టెన్ గా చూడబోతున్నాం

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు