ఇబ్రహీంపట్నం స్వేచ్ఛ: Bird Flu in Batasingaram: బర్డ్ ఫ్లూ సోకి వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. నియోజకవర్గ పరిధి అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారంలోని పలు కోళ్ల ఫామ్ లలో కోళ్లకు బర్డ్ ఫ్లూ రావడంతో మిగతా కోళ్ల ఫామ్ రైతుల్లో ఆందోళన మొదలయ్యింది. బర్డ్ ఫ్లూ కలకలం రేపడంతో అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. నాలుగు రోజుల క్రితం చనిపోయిన కోళ్ల నుంచి శాంపిల్స్ సేకరించిన అధికారులు ల్యాబ్‌కు పంపించారు.
బర్డ్ ఫ్లూ అని నివేదిక ఇవ్వడంతో పౌల్ట్రీ ఫామ్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. రూ.కోట్లలో ఆస్తి నష్టం సంభవిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోసారి అదే ప్రాంతంలో అధికారులు శాంపిల్స్‌ను సేకరించారు. బర్డ్ ఫ్లూ నివారణ కోసం కోళ్ల ఫామ్స్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో వ్యాధి వాపించకుండా పౌల్ట్రీ ఫామ్ మొత్తం మందులు చల్లారు. చనిపోయిన కోళ్లను, బ్రతికి ఉన్న కోళ్లను జెసిబి సహాయంతో పూడ్చి పెట్టారు. కోడి గుడ్లు, కోళ్లు ఎక్కడికడకు రవాణా చేసారన్న దానిపై అధికారులు అరా తీస్తున్నారు.
జిల్లా వైద్య అధికారులు మాత్రం బర్డ్ ఫ్లూ పై నోరు మెదపదం లేదు. ఇప్పటికే ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ సోకి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన చోటు చేసుకున్నప్పటికీ, తెలంగాణలో బర్డ్ ఫ్లూ సోకి ప్రజలు ఇబ్బందుల పాలు కాకముందే అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ఈ బ్లడ్ ఫ్లూ కలకలం విజయవాడ జాతీయ రహదారి వెంట ఉన్నట్లు వెటర్నరీ డాక్టర్లు వెల్లడించారు. బాటసింగారం నుంచి చౌటుప్పల్ పరిధి ప్రాంతాలలో ఇదే పరిస్థితి ఉన్నదని వెటర్నరీ డాక్టర్లు వెల్లడించారు.
ప్రభుత్వం ఆదుకోవాలి : లక్ష్మణ్, కోళ్ల ఫామ్ రైతు
కోళ్ల పెంపకమే జీవనాధారంగా ఫారాలు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాం. కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుతుండడంతో లక్షలలో నష్టం వాటిల్లుతుంది. దీంతో ఫామ్ లు నిర్వహణకు దూరంగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఈ కారణంగా నష్టపోతున్న కోళ్ల ఫామ్ రైతులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి.
Also Read: Commissioner Sunpreet Singh: గంజాయి మూలాల డొంకలు పట్టండి.. కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్