Lady Aghori: గత కొన్ని రోజులుగా లేడీ అఘోరి (Lady Aghori) వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. శ్రీవర్షిణి అనే బీటెక్ చదివిన యువతిని అఘోరి మాయమాటలు చెప్పి తన వశం చేసుకుందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. తమ కూతుర్ని అఘోరి కిడ్నాప్ చేసిందంటూ యువతి తల్లిదండ్రులు పోలీసులకు సైతం ఫిర్యాదు చేయడం ఇటీవల తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ క్రమంలోనే తాజాగా అఘోరి – వర్షిణి ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.
గుజరాత్ లో గుర్తింపు
లేడీ అఘోరి తమ కూతుర్ని కిడ్నాప్ చేసిందంటూ మంగళగిరి పోలీసులకు ఇటీవల వర్షిణి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే తన ఇష్టపూర్వకంగానే అఘోరీతో ఉంటున్నట్లు వర్షిణీ చెప్పడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తూ వచ్చిన లేడీ అఘోరి.. ఆ తర్వాత సడెన్ గా అదృశ్యమైంది. దీంతో వర్షిణి జాడ తెలియక ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే గుజరాత్ లో ఆమె ఉన్నట్లు గుర్తించి అక్కడి పోలీసుల సాయాన్ని వర్షిణి కుటుంబ సభ్యులు తీసుకున్నారు.
వర్షిణీని లాక్కెళ్లిన ఫ్యామిలీ
గుజరాత్ సౌరాష్ట్రలోని పెట్రోల్ బంక్ లో లేడీ అఘోరి, శ్రీ వర్షిణి నిద్రిస్తుండగా పోలీసులు సాయంతో యువతి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. యువతిని బలవంతంగా తమ వెంట తీసుకెళ్లారు. తాను అఘోరీని వదిలి రానని కన్నీళ్లు పెట్టుకొని ప్రాధేయపడినా కుటుంబ సభ్యులు వినలేదు. వర్షిణి ఫ్యామిలీకి చెందిన విష్ణు, శ్రీ హర్ష, భవాని ఆమెను తమతో పాటు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బయటకు రాగా అవి క్షణాల్లో వైరల్ గా మారాయి.
అఘోరి సంచలన కామెంట్స్
మరోవైపు లేడీ అఘోరీ సైతం స్వయంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. శ్రీవర్షిణి, తనను బలవంతంగా విడదీశారని మండిపడింది. ఈ క్రమంలో వర్షిణి కోసం అఘోరీ సైతం వెక్కి వెక్కి ఏడ్చింది. ఇకపై వర్షిణికి ఏమి జరిగినా తనకు సంబంధం లేదని అఘోరీ స్పష్టం చేసింది. ఆమెకు ఏం జరిగినా వర్షిణి కుటుంబ సభ్యులదే బాధ్యత అని తేల్చి చెప్పింది. మరోవైపు ఓ మీడియా ఛానల్ ఇంటర్వూలో అఘోరి మాట్లాడుతూ.. తనను నమ్మి ఎవరూ తన వద్దకు రావద్దని సూచించింది.
Also Read: Hyd Local Body Elections: హైదరాబాద్ లో ఎన్నికల హీట్.. సై అంటోన్న బీజేపీ-ఎంఐఎం.. గెలుపు ఆ పార్టీదేనా?
వారిద్దరి పరిచయం ఎలా అంటే?
వర్షిణి కుటుంబ సభ్యుడు శ్రీవిష్ణు ద్వారా ఆమెకు అఘోరీతో పరిచయం అయ్యింది. ఓ రోజు విజయవాడలోని జనసేన పార్టీ ఆఫీసు వద్ద అఘోరి కారు ఆగిపోగా.. విష్ణు అఘోరిని చూసి తన ఇంటికి రావాలని సూచించారు. అఘోరి ఆ ఇంట్లో దాదాపు రెండు వారాలు ఉండగా.. ఈ క్రమంలో శ్రీవర్షిణి ఆమె మాయలో పడిపోయింది. ఓ రోజు మార్నింగ్ ఇద్దరూ చెప్పాపెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. దీంతో శ్రీ వర్షిణి కుటుంబ సభ్యులు ఆమెపై కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.