SRH Fans: '300 సరే మ్యాచ్ గెలవాలిగా.. ఇలాగే ఆడితే చాప చుట్టేస్తారు'.. సన్ రైజర్స్ పై ఫ్యాన్స్ ఫైర్ | SRH Fans: '300 సరే మ్యాచ్ గెలవాలిగా.. ఇలాగే ఆడితే చాప చుట్టేస్తారు'.. సన్ రైజర్స్ పై ఫ్యాన్స్ ఫైర్
SRH fans (Image Source: Twitter)
స్పోర్ట్స్

SRH Fans: ‘300 సరే మ్యాచ్ గెలవాలిగా.. ఇలాగే ఆడితే చాప చుట్టేస్తారు’.. సన్ రైజర్స్ పై ఫ్యాన్స్ ఫైర్

SRH Fans: ఐపీఎల్ – 2025 (IPL 2025) సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sun Risers Hyderabad) జట్టుకు ఏమాత్రం కలిసి రావడం లేదు. తొలి మ్యాచ్ లో ఏకంగా 286 పరుగులు సాధించిన ఆ జట్టు.. ఆ తర్వాతి మూడు మ్యాచుల్లో పూర్తిగా తేలిపోయింది. కనీసం ప్రత్యర్థి జట్టుకు పోటీ ఇవ్వలేక చతికలపడింది. తాజాగా కోల్ కత్తా నైట్ రైడర్స్ (Kolkatta Night Riders)తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. దీంతో ఆ జట్టు పై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఎస్ఆర్ హెచ్ విధ్వంసక ఓపెనర్.. ట్రావిస్ హెడ్ (Travis Head)ను కేకేఆర్ (KKR) టీమ్ టార్గెట్ చేసింది. అతడిపై ట్విటర్ వేదికగా సెటైర్లు వేసింది.

తేలిపోయిన సన్ రైజర్స్ బ్యాటర్లు
ఎస్ఆర్ హెచ్ (SRH) మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ (KKR).. నిర్ణిత 20 ఓవర్లలో 200 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనకు దిగిన సన్ రైజర్స్ బ్యాటర్లు.. 120 (16.4) ఆలౌట్ అయ్యారు. హెన్రీచ్ క్లాసెన్ (33) మినహా ఎస్ఆర్ హెచ్ బ్యాటర్లలో ఎవరూ చెప్పుకోతగ్గ రన్స్ చేయలేదు. ముఖ్యంగా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) వరుసగా మూడో మ్యాచ్ లోనూ విఫలమై 4 పరుగులు మాత్రమే చేశారు. దీంతో ట్రావిస్ సహా.. అభిషేక్ శర్మ (Abhishek Sharma), ఇషాన్ కిషాన్ (Ishan Kishan) బ్యాటింగ్ వైఫల్యాలపై విమర్శలు వస్తున్నాయి.

కేకేఆర్ సెటైర్లు
ఈ క్రమంలోనే ట్రావిస్ హెడ్ ను టార్గెట్ చేసిన కేకేఆర్ సోషల్ మీడియా విభాగం.. తమ ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్టు పెట్టింది. తమ జట్టుపై ఆడిన గత మూడు మ్యాచుల్లో ట్రావిస్ తక్కువ పరుగులకే ఔటైన విషయాన్ని తెలయజేస్తూ స్పెషల్ పోస్ట్ పెట్టింది. అందులో తొలి రెండు మ్యాచ్ లలో ట్రావిస్ హెడ్ డకౌట్ కాగా.. కేకేఆర్ తో జరిగిన తాజాగా మ్యాచ్ తో కేవలం 4 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో హెడ్ తెలియాపోయాడు అనే అర్థం వచ్చేలా కేకేఆర్ పోస్టు పెట్టడంపై సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తర్వాతి మ్యాచ్ లో హెడ్ విశ్వరూపం మీరు చూస్తారంటూ సమర్థిస్తున్నారు.

Also Read: Secunderabad railway station: ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్ నుంచి రైళ్లు మళ్లింపు.. తెలుసుకోకుంటే చిక్కే!

300 సరే.. మ్యాచ్ గెలవాలిగా?
గత సీజన్ లో పరుగుల వరద పారించినా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఐపీఎల్ 2025లోనూ అదే తరహా ప్రదర్శన చేయాలని భావించింది. ఇందులో భాగంగానే తొలి మ్యాచ్ లో 286 రన్స్ చేసి తర్వాతి మ్యాచ్ లో 300 చేయగలమన్న సంకేతాన్ని పంపింది. ఈ క్రమంలోనే అటు ఫ్యాన్స్ సైతం 300 స్కోర్ చేయాలని పెద్ద ఎత్తున ఆకాంక్షించారు. ఈ క్రమంలో తర్వాతి మూడు మ్యాచ్ ల్లో సన్ రైజర్స్ బ్యాటర్లు తేలిపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 300 సరే ముందు మ్యాచ్ గెలవండి అంటూ ఫ్యాన్స్ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. టోర్నీలో ఇలాగే కొనసాగితే చాప చుట్టేయడం ఖాయమని విమర్శలు చేస్తున్నారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..