Chandrababu Naidu latest news
క్రైమ్

AP News: డాక్యుమెంట్లను ఎందుకు నాశనం చేశారు? స్కెచ్ అదేనా?

SIT Office: ఏపీలో డాక్యుమెంట్లను కాల్చిన ఘటన కలకలం రేపుతున్నది. సోమవారం ఉదయం సిట్ కార్యాలయంలో కాగితాలను కొందరు అధికారులు కాల్చేశారు. తాడేపల్లి పాతూరు రోడ్డులోని సిట్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన అనేక అనుమానాలకు తావిచ్చింది. ఈ కాగితాలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, పురంధేశ్వరి, మరికొందరికి సంబంధించిన కేసు తాలూకు పత్రాలని తెలిసింది. అలాగే, అధికారుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలని చెబుతున్నారు. ఎన్నికల ముంగిట్లోనే వీటిని కాల్చేయడంపై టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నది.

కాగితాలు కాల్చడంపై సిట్ చీఫ్, ఐజీ కొల్లి రఘురాం రెడ్డి వివరణ ఇచ్చారు. పలు కేసుల్లో తమ రికార్డుల కొరకు, నిందితుల తరఫు న్యాయవాదులకు, కోర్టుకు సమర్పించడానికి లక్షల కాపీలు తీశామని చెప్పారు. ఆ సందర్భంలో జిరాక్సు మెషీన్లు వేడెక్కి కాలిపోయిన, అందులో ఇరుక్కుపోయి పాడైపోయిన కాపీలు తమ కార్యాలయంలో చాలా పేరుకుపోయాయని, అందుకే వాటిని తగులబెడుతున్నట్టు వివరించారు. అంతేకానీ, ఇందులో వేరే దురుద్దేశ్యమేమీ లేదని స్పష్టం చేశారు. కానీ, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రసారం చేశాయని, ఇలాంటి ఊహాజనిత తప్పుడు కథనాలతో ప్రజల్లో అనుమానాలు రేపొద్దని సూచించారు.

Also Read: రాజకీయ పార్టీల ఉగాది పచ్చడి.. చేదు రుచి, తీపి కబురుల పొలిటికల్ రెసిపీ

కాగా, సిట్ చంద్రబాబుపై అక్రమ కేసులో నమోదు చేశారని, అందులో సృష్టించిన తప్పుడు ఆధారాలను తగులబెట్టారా? అని టీడీపీ అనుమానిస్తున్నది. ఎలక్షన్ కమిషన్ తనను తప్పిస్తుందని ముందే గ్రహించి కొల్లి రఘురాం రెడ్డి ఈ పని చేశారా? అని ఆరోపణలు చేస్తున్నది. ఇదంతా జగన్ రెడ్డిని సేఫ్‌గా ఉంచే స్కెచ్‌ కాదు కదా..? అని దీర్ఘాలు తీస్తున్నది.

చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన అధికారి కొల్లి రఘురాం రెడ్డినే కావడం గమనార్హం. ఈయన జగన్‌కు అత్యంత సన్నిహితుడనే ప్రచారం ఉన్నది. పైగా మొదటి నుంచి చంద్రబాబుపై మోపిన కేసు అక్రమమే అని టీడీపీ ఆరోపిస్తూనే ఉన్నది. ఈ సందర్భంలో సిట్ కార్యాలయంలో కాగితాలను కాలబెట్టడం హాట్ టాపిక్ అయింది.

Also Read: సూర్యగ్రహణం భారత్‌లో ఎందుకు కనిపించలేదు?

కాగా, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలను ధ్వంసం చేసిన ఘటనను గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఓడిపోగానే పర్యాటక శాఖ కార్యాలయంలో ప్రమాదంలో కంప్యూటర్లు కాలిపోవడం, కొన్ని కార్యాలయాల నుంచి ఫైల్లు, కంప్యూటర్లు ఎత్తుకెళ్లిన ఘటనలూ చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ వీటిపై దర్యాప్తు చేపడుతున్నది. ఈ తరుణంలో.. అదీ ఎన్నికలు మరో నెల రోజుల కాలవ్యవధిలో జరుగుతున్న సందర్భంలో కాగితాలను కాలబెట్టడంపై టీడీపీ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నది.

ఎన్నికల కోడ్ అమలవుతున్నా కొందరు అధికారులు జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే కొల్లి రఘురాంరెడ్డిని అసోంకు అబ్జర్వర్‌గా బదిలీ చేసింది. ఈ విషయం ముందుగానే ఊహించి రఘురాం రెడ్డి కాగితాలను కాలబెట్టే పని చేయించినట్టుగా టీడీప ఆరోపణలు చేస్తున్నది.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు