OTT Movie: కరోనా తర్వాత నుంచి ఓటీటీలకు డిమాండ్ పెరిగిందనే చెప్పుకోవాలి. అంతకముందు వరకు ఏ సినిమానైన థియేటర్ లో చూసే వాళ్ళు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఇష్ట పడుతున్నారు. సినీ లవర్స్ కూడా ఇటు వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక, వారి కోసం ప్రతి వారం కొత్త కొత్త చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు. థ్రిల్లర్ , సస్పెన్స్, యాక్షన్ మూవీస్ అయితే వెంటనే వైరల్ అవుతుంటాయి. నిముషాల్లోనే మిలియన్ వ్యూస్ వస్తాయి. ఇదిలా ఉండగా, ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా కొద్దీ రోజుల్లో మన ముందుకు రాబోతుంది.
Also Read: Online Betting Gang: బెట్టింగ్ రక్కసి గుట్టు రట్టు.. 16 మంది అరెస్ట్.. వెలుగులోకి సంచలన నిజాలు
హిందీలో తెరకెక్కిన ‘చోరీ’ చిత్రం, 2021 నవంబర్లో థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి మొదటి షో నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఆడియెన్స్ కూడా మరిచిపోలేదు. చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు కట్టిపడేశాయి. ప్రేక్షుకుల దగ్గర మంచి మార్కులను కొట్టేసింది. నుష్రత్ బరూచా ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమాకి త్వరలో సీక్వెల్ రానుంది. అసలు కథ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఓ యువతి గర్భవతి అవుతుంది. అయితే, దెయ్యాలు ఆమె చుట్టూ తిరుగుతూ ఆమెను వేధిస్తుంటాయి. వారి నుంచి తన బిడ్డను ఎలా కాపాడుకుందనేది ‘చోరీ 1’ లో చూపించారు. ఇప్పుడు సీక్వెల్ లో ఆమెకి పుట్టిన బిడ్డను దెయ్యాల విపరీతంగా భయపెడతాయి. ఆ సమయంలో కన్న బిడ్డ కోసం కొరివి దెయ్యలతో పోరాడి ఆమె ఎలా రక్షిస్తుందనేది ‘చోరీ 2’లో చూపించనున్నారు. విశాల్ ఫురియా డైరెక్షన్ చేసిన ఈ చిత్రం, ఏప్రిల్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో వారు రిలీజ్ చేశారు. ఈ కథ జానపదానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఓ వైపు రాజులు .. రాజ్యాలను గురించి చెబుతూ, ఇంకో వైపు మూఢనమ్మకాలు .. దెయ్యాల చుట్టూ తిరిగే కథ ఇది. ట్రైలర్ చూసిన వారందరూ ఇది కూడా హిట్ అవ్వడం పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక శర్మ, సోహా అలీఖాన్, సౌరభ్ గోయల్, పల్లవి అజయ్ ముఖ్య పాత్రల్లో నటించారు.