Global IT companies In AP(image credit:X)
ఆంధ్రప్రదేశ్

Global IT companies In AP: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్రానికి టాప్ గ్లోబల్ కంపెనీ.. 7,500 మందికి ఉపాధి!

Global IT companies In AP: రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. అనకాపల్లి జిల్లా గోరపూడి గ్రామంలోని ఐపీ రాంబిల్లి ఫేజ్-2లో భారీ బల్క్ డ్రగ్స్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు లారస్ ల్యాబ్స్ సంస్థ ముందుకొచ్చింది. ఈ పరిశ్రమ కోసం లారెస్ ల్యాబ్స్ సుమారు రూ.5,000 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 7,500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతారని అంచనాగా ఉంది.

ల్యారస్ ల్యాబ్స్ ఇప్పటికే విశాఖపట్నం నగర పరిసర ప్రాంతాల్లో 2007 నుంచి పెట్టుబడులు పెడుతోంది. ఇప్పటివరకు రూ.6,500 కోట్లతో తయారీ యూనిట్లు నెలకొల్పగా, 10 వేల మందికి ఉద్యోగాలు దక్కాయి. లారెస్ ల్యాబ్స్ సంస్థకు బెంగళూరు, హైదరాబాద్‌లో కూడా పరిశ్రమ యూనిట్లు ఉన్నాయి. సంస్థ విస్తరణలో భాగంగా రాంబిల్లిలో పరిశ్రమలు పెడుతోంది. ఫర్మంటేషన్, క్రాప్ సైన్స్ కెమికల్స్, గ్రీన్ కెమిస్ట్రీ వంటి స్పెషాలిటీ కెమికల్స్‌ ఉత్పత్తి చేయనుంది.

Also read: Sandhya Rani on RK Roja: సుద్దపూస మాటలు మానుకో.. రోజాకు మంత్రి వార్నింగ్

ఏపీలో విస్తరణపై కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంతో సంస్థ సంప్రదింపులు జరుపుతోంది. ఈ క్రమంలో లారస్ ల్యాబ్స్ సీఈవో చావా సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చావా నరసింహారావు గురువారం (ఏప్రిల్ 3) ముఖ్యమంత్రి నారా చంద్రబాబును సచివాలయంలో కలిశారు. భూకేటాయింపులకు సుముఖత వ్యక్తం చేసిన సంస్థ తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తమ విధానమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

భూ కేటాయింపులతో పాటు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా క్షేత్ర స్థాయిలో పనులు ప్రారంభించాలని సంస్థ ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా పెద్దఎత్తున యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు