Sandhya Rani on RK Roja: మాజీ మంత్రి రోజాపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఫైర్ అయ్యారు. అది కూడా అలా ఇలా కాదు, రోజాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అలాగే సీఎం చంద్రబాబును ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పై మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మంత్రి మాట్లాడుతూ.. జబర్దస్త్ రోజా గురించి మాట్లాడాలంటే రోతగా ఉందన్నారు. సిగ్గుశరం లేకుండా ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే ప్రజలు ఛీ కొట్టి 11సీట్లు ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో నుండి ప్రజలు తరిమి తరిమి కొట్టడానికి మరొక్కసారి సిద్ధంగా ఉన్నారని, గత వైసీపీ హయాంలో మహిళలపై జరుగుతున్న దాడులు మర్చిపోయి ఇప్పుడు సుద్దపుసలాగా మాట్లాడుతున్నారంటూ రోజాపై కామెంట్స్ చేశారు.
ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్లాది రూపాయల నయా పంథాలో దోపిడీ చేసి గురివింద సామెతలు రోజా చెబుతున్నారని, యువత పేరుతో ఆడుదాం ఆంధ్ర అని పెట్టి, వృద్ధుల పేర్లతో దోపిడీ చేశారని మంత్రి ఆరోపించారు. మొత్తం సంగతి బట్టబయలు అయినా ఇంకా రోజా మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందన్నారు. ఇప్పుడు గురివింద గింజ సామెత గుర్తుకు తెచ్చుకుంటే ఆమెకు బాగుంటుందని మంత్రి తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు.
వైసీపీ అక్రమ దోపిడీ అన్యాయాలు మరచిపోయి 11 సీట్లు ఇచ్చినా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉండటం చూస్తే, ఇంగిత జ్ఞానం లేని వైసీపీ నేతలు మాటలు పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నారు. మహిళలకు అమ్మకు వందనం ఇస్తాం, రైతు కుటుంబాలకు రైతు భరోసా ఇస్తామని మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు జోరుగా అమలులోకి వచ్చాయని, వైసీపీకి రెడ్ బుక్ పేరు చెబితే భయపడి పారిపోతున్నారన్నారు.
Also Read: Friendly Traffic Police: బైక్ ఆపిన పోలీస్.. ఒట్టేసి మరీ చెప్పిన బైకర్.. వీడియో వైరల్..
అభివృద్ధి కే పెద్దపీట కూటమి ప్రభుత్వం వేస్తుందని, వైసీపీ దౌర్జన్యం ప్రజలు చూసారన్నారు. అందుకే 11సీట్లు ఇచ్చారని, పరదాల పాలన, అక్రమ కేసులు, దౌర్జన్యం, ఇవ్వన్నీ వైసీపీ సొంత పాలనగా మంత్రి విమర్శలు గుప్పించారు. మొత్తం మీద మంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ పై మాజీ మంత్రి రోజా ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.