Friendly Traffic Police: ఏమయ్యా.. నేను ఊర్లో ఉండవద్దా? నీకు కనపడవద్దా? చెప్పు.. మా మీద నీకు అంత కోపం ఎందుకు? వెళ్లమంటే వెళ్లిపోతా.. కానీ నా మాట విను.. అనగానే ఎదుట నిలబడ్డ యువకుడు.. లేదు సార్.. ప్రమాణం చేస్తున్నా.. నా జీవితాంతం మీరు చెప్పిందే వింటా సార్.. ఇక నుండి మీకు ఇలా కనిపిస్తే ఒట్టు అంటూ వారిద్దరి మధ్య సంభాషణ సాగింది. ఇదంతా ఎక్కడ జరిగిందంటే.. ఏపీలోని విజయవాడలో..
అసలేం జరిగిందంటే..
విజయవాడ ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోకు తెగ లైకులు వస్తున్నాయి. క్షణాల వ్యవధిలో మిలియన్స్ వ్యూస్ రావడం విశేషం. ఇంతకు అంతలా ఆ వీడియోలో ఏముందో, మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ఇటీవల హెల్మెట్ ధారణపై బైకర్స్ కు అవగాహన కల్పిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా హెల్మెట్ ధారణపై అవగాహన కల్పిస్తుండగా, ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. కొంతమంది బైకర్స్.. ఒట్టేసి మరీ హెల్మెట్ ఉపయోగిస్తామంటూ హామీ ఇస్తున్నారు.
ఇలాగే ఓ సీన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. విజయవాడలో ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ ఒకరు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయానికి ఒక వాహనదారుడు బైక్ పై వచ్చాడు. అతను ఏదో ఆర్డర్ డెలివరీ చేసేందుకు వెళ్తున్నాడు. అయితే హెల్మెట్ ధారణ పాటించక పోవడంతో పోలీసులు ఆపారు. అరెరె పోలీసులకు చిక్కానే అంటూ కోపం, అసహనంతో ముఖాన్ని మార్చాడు. ఏం చేయాలో తోచక కోపంతో ఉన్నాడు. అంతలోనే ఓ ఇన్స్ పెక్టర్ వచ్చి, ఎందుకంత అసహనం ఏం జరిగిందంటూ ప్రశ్నించారు.
అలా ప్రశ్నించారో లేదో మనోడు ఓపెన్ అయ్యాడు. ఎమర్జెన్సీగా ఆర్డర్ డెలివరీ చేయాలని, లేకుంటే నష్టం వస్తుందన్నాడు. సరే.. ఆ నష్టం సరే.. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతూ.. యాక్సిడెంట్ కు గురైతే ఆ నష్టం ఏంటి అంటూ ప్రశ్నించారు ఆ ఇన్స్పెక్టర్. ఇక అంతే సదరు యువకుడు సైలెంట్ అయ్యాడు. కొద్దిక్షణాల తర్వాత సదరు యువకుడు కాస్త కుదుట పడ్డాడు. ఇన్స్ పెక్టర్ మాట్లాడిన తీరుకు ఆనందపడ్డ యువకుడు చిరునవ్వులు చిందించాడు.
Also Read: Gold Rate Today: మహిళలు ఎగిరిగంతేసే న్యూస్ .. భారీగా గోల్డ్ ధరలు పతనం.. ఎంతంటే?
యువకుడి భుజం మీద చెయ్యి వేసి మరీ, ఎందుకంత కోపం? నేను ఈ ఊర్లో ఉండవద్దా? వెళ్లిపోవాలా? చెప్పండి.. అదే చేస్తానంటూ మాట్లాడారు. ఇక యువకుడు ఆ మాటలను విని ఒక్కసారిగా.. సార్.. ఇప్పటి నుండి హెల్మెట్ ధరించక పోతే చూడండి. నేను ఇక్కడే తిరుగుతూ ఉంటాను సార్. నేను హెల్మెట్ కొని మీ దగ్గరికి వచ్చి కలుస్తాను అంటూ ఒట్టేశాడు. ఇక అంతే ఆ ఇన్స్ పెక్టర్ కూడా యువకుడిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ వీడియో ఎప్పటిదో కానీ, ప్రస్తుతం వైరల్ అవుతుండగా, ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ.. సదరు ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ కు నెటిజన్స్ సెల్యూట్ చేస్తున్నారు.
ఈ వీడియో కోసం https://www.facebook.com/reel/1180726560423127 ఇక్కడ క్లిక్ చేయండి