MLC Kavitha in custody of ED
క్రైమ్

Delhi Liquor Case: ఇతర నిందితుల్లాగే కవితకూ రిమాండ్ పొడిగింపులేనా?

MLC Kavita: ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఈ నెల 23వ తేదీ వరకు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ నిర్ణయించింది. గత నెల 26వ తేదీన కోర్టు విధించిన రిమాండ్ ఇవాళ్టితో ముగిసింది. దీంతో ఈడీ ఆమెను ఉదయమే కోర్టులో హాజరుపరిచింది. ఢిల్లీ లిక్కర్ కేసులోని ఇతర నిందితులకూ కోర్టు తరుచూ రిమాండ్‌ను పొడిగిస్తూ వస్తున్నది.

కవితకు బెయిల్ ఇవ్వరాదని, ఆమె సాక్షులను ప్రభావితం చేసే ముప్పు ఉన్నదని ఈడీ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఆమెకు కస్టడీని పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. కాగా, ఈ కేసులో కవితకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని కవిత తరఫు న్యాయవాది వాదించారు. కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వాలని కోరారు. కోర్టులో కవిత స్వయంగా మాట్లాడుతుందని న్యాయవాది చెప్పగా.. కోర్టు అందుకు తిరస్కరించింది. కోర్టులో మాట్లాడాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

Also Read: ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖలోని వివరాలివే

ఆమెకు కస్టడీని పొడిగించడంతో అధికారులు తిరిగి ఆమెను తిహార్ జైలుకే తీసుకెళ్లారు. వెళ్లుతున్న సందర్భంలో మీడియాతో మాట్లాడారు. ఇది అక్రమ కేసు అని, ఇల్లాజికల్ కేసు అని ఆరోపించారు. ఇది కేవలం రాజకీయ కుట్రతో తనపై మోపారని పేర్కొన్నారు. దర్యాప్తు అధికారులు తనను అడిగిన ప్రశ్నే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని అన్నారు. తాను చెప్పాల్సిందంతా కోర్టులో చెప్పానని వివరించారు. కోర్టుకు ఓ లేఖ రాయనున్నట్టూ తెలిపారు.

14 రోజుల ఆమె జ్యుడీషియల్ కస్టడీ ఈ రోజుతో ముగియనుండటంతో కవిత భర్త, ఇతర బంధువులు ఢిల్లీకి వచ్చారు. వారిని కలవడానికి కోర్టు కవితకు అనుమతి ఇచ్చింది.

Also Read: సూర్యగ్రహణం భారత్‌లో ఎందుకు కనిపించలేదు?

ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించడానికి అనుమతించాలని సీబీఐ ఇటీవలే రౌస్ అవెన్యూ కోర్టుకు విజ్ఞప్తి చేయగా అందుకు అనుమతి ఇచ్చింది. మరుసటి రోజే ఆమెను తిహార్ జైలులోనే విచారించడానికి ఏర్పాట్లు చేసుకుంది. ఈ అనుమతికి సంబంధించి తమకు సమాచారం లేదని, అనుమతిని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ కవిత కోర్టులో పిటిషన్ వేశారు. ఆ విచారణ జరుగుతుండగానే సీబీఐ కోర్టుకు వచ్చింది. ఈ నెల 6వ తేదీన సీబీఐ ఆమెను ప్రశ్నించింది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!