మహబూబాబాద్ స్వేచ్ఛ: Mahabubabad Crime: భద్రాచలం ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి తాటి పార్థసారధిని భార్య తాటి స్వప్న ఆమె ప్రియుడు వెంకట విద్యాసాగర్ లు కలిసి హత్యకు పథకం రచించారు. పక్క ప్లాన్ ప్రకారమే స్కెచ్ వేసి పోలీసులకు దొరకకుండా వాట్సప్ కాల్స్ మాట్లాడుతూ పార్థసారథి హత్యకు కుట్ర చేశారు. గురువారం సాయంత్రం మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించి జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ హత్యకు గల వివరాలను వెల్లడించారు.
భద్రాచలం కు చెందిన తాటి పార్థసారథి గత ఏడాది క్రితం దంతాలపల్లి లో మహాత్మ జ్యోతిరావు బాపూలే పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని రోజులు దంతాలపల్లి మరికొన్ని రోజులు భద్రాచలంలో గడుపుతూ వస్తున్నాడు. దంతాలపల్లి విధుల్లో ఉన్న సమయంలో భద్రాచలానికి చెందిన గవర్నమెంట్ టీచర్ వెంకట విద్యాసాగర్ అనే వ్యక్తితో పరిచయమైంది. పరిచయం ప్రేమగా మారి అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలోనే చాలాసార్లు వివాదాలు చోటు చేసుకోగా పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు నిర్వహించారు. అయినప్పటికీ స్వప్న, విద్యాసాగర్ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూనే వస్తున్నారు.
ఐదు లక్షల సుపారీ ఇచ్చి అంతమొందించిన భార్య, ప్రియుడు
తమ అక్రమ సంబంధానికి హాటి పార్థసారథి తరచూ అడ్డు వస్తున్నాడని విద్యాసాగర్, స్వప్నలు కలిసి స్కెచ్ వేశారు. కొత్తగూడెంకు చెందిన వినయ్ కుమార్ శివ శంకర్ వంశీ లతో ఐదు లక్షల సుఫారీ మాట్లాడుకొని మర్డర్ చేసేందుకు పథకం వేశారు.
రూట్ మార్చిన వదలని సుఫారి నిందితులు
ఈ క్రమంలోనే భద్రాచలం నుండి పార్థసారథి తన ద్విచక్ర వాహనంపై దంతాలపల్లిలో ఉద్యోగం చేసేందుకు గత నెల 31 న సాయంత్రం బయలుదేరాడు. పార్థసారథి వివరాలను స్వప్న ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సుఫారీ నిందితులకు సమాచారం అందించింది. ఈ క్రమంలో అనుమానం వచ్చిన పార్థసారథి రోడ్డు మార్చిన దుండగులు ఆయన్ను వదలకుండా గత నెల 31 తెల్లవారుజాము సమయంలో అతికిరాతకంగా పదునైన ఆయుధాలతో హత్య చేశారు.
హత్యలో పాల్గొన్న ముగ్గురితోపాటు రెక్కి నిర్వహించిన వ్యక్తి పరారి
ప్రభుత్వ ఉద్యోగి పార్థసారథి హత్యలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులతో పాటు రెక్కీ నిర్వహించిన మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. భార్య స్వప్న, ఆమె ప్రియుడు విద్యాసాగర్ ను గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. హత్యలో పాల్గొన్న నిందితుల ఫోన్ లొకేషన్లు గుర్తించామని అతి త్వరలోనే ముగ్గురు నిందితులను రెక్కి నిర్వహించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలిస్తామన్నారు.
Also Read: Nagarkurnool crime: ఊరుకొండ పేట గ్యాంగ్ రేప్ నిందితుల అరెస్ట్.. జిల్లా ఎస్పీ ఏమన్నారంటే?