Aravind Kumar on HCU land issue (imagrcredit:twitter)
తెలంగాణ

Aravind Kumar on HCU land issue: ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి.. అరవింద్ కుమార్ యాదవ్

స్వేచ్ఛ మహబూబ్ నగర్: Aravind Kumar on HCU land issue: హెచ్ సీ యూ భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోందని, తద్వారా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ యాదవ్ ఎద్దేవ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సన్నాహక సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో అరవింద్ కుమార్ మాట్లాడారు.

ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ మహాశయుడినే భాజపా నాయకులు మంత్రి హోదాలో ఉన్నామనే సోయి కూడ లేకుండా అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారని, భాజపా రాజ్యాంగాన్ని మొత్తాన్ని మార్చాలని చూస్తుందని భాజపా వైఖరికి నిరసనగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జై బాపూ జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు తెలిపారు.

Also Read: Chapata chillies: తెలంగాణలో మరోప్రాతానిక జియాలాజికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇచ్చిన సంస్థ.. అదేంటంటే!

ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానిది కాదన్నారు, ఆ భూమి వర్సిటీ కానప్పుడు తీసుకుంటున్నామనడంలో వాస్తవం లేదన్నారు. పర్యావరణానికి ముప్పు తెచ్చి చర్యలు వర్సిటీ ప్రాంతంలో ఏమాత్రం ప్రభుత్వం చేపట్టబోదన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఓ కంపెనీకి 400 ఎకరాల భూమిని ఇచ్చి పరిహారంగా యూనివర్సిటీకి అనుకుని మరోచోట 397 ఎకరాలు ఇచ్చిందని తెలిపారు.

ఇందుకు సంబంధించిన ఒప్పందం గతంలోని ప్రభుత్వం యూనివర్సిటీ అధికారుల మధ్యన జరిగిందన్నారు. జువంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2006 నవంబర్ 21న ఐఎంజీ భారత్ కు టిడిపి ఇచ్చిన భూ కేటాయింపులను రద్దు చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత ఐ ఎం జి హైకోర్టును ఆశ్రయించగా, ఈ పదేళ్లలో ఆ భూమిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నం చేయలేదన్నారు.

తమ అధికారంలోకి వచ్చాక ఉద్దండులైన న్యాయవాదుల సహకారంతో కేసు గెలిచి మళ్లీ ఆ భూమి ప్రభుత్వానికి దక్కేలా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేశారన్నారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి అబాసుపాలు చేసే ప్రయత్నాలు చేస్తే ప్రజల ఎత్తైన బుద్ధి చెబుతారన్నారు.

Also Read: Thummala Nageswara Rao: రైతన్నల కోసమే రైతు బజార్లు.. దళారి వ్యవస్థకు చెక్

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు