Thummala Nageswara Rao(image credit:X)
తెలంగాణ

Thummala Nageswara Rao: రైతన్నల కోసమే రైతు బజార్లు.. దళారి వ్యవస్థకు చెక్

Thummala Nageswara Rao: రైతులు తాము పండించిన కూరగాయలను నేరుగా రైతు బజార్ లో అమ్ముకునేందుకు వీలుగా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం మంత్రి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి ఖమ్మం నగరం 44వ డివిజన్ శ్రీరామ్ నగర్ లో మున్సిపల్ సాధారణ నిధులు రూ. 58.50 లక్షలతో షెడ్లు, ప్లాట్ ఫాంలను నిర్మించి రైతు బజార్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ కూరగాయలు పండించే రైతులు సొంతంగా నేరుగా అమ్ముకునేందుకు సౌకర్యంగా ఉండాలని గతంలో ఏర్పాటు చేసిన రైతు బజార్ లో నేడు ఫ్లాట్ ఫాం, షెడ్లు నిర్మించి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పేద రైతుల కోసం కలెక్టర్ మంచి హృదయంతో ఈ పనులు పూర్తి చేశారని తెలిపారు.మార్కెట్ లో పంట పండించే రైతులకు మాత్రమే స్థానం ఇవ్వాలని, దళారులకు ఎట్టి పరిస్థితిలో అవకాశం ఇవ్వకూడదని, ఖమ్మం చుట్టుపక్కల ఉన్న రైతులు నేరుగా వచ్చి అమ్ముకోవాలని, అప్పుడు రైతులకు ఒక రూపాయి మిగలడంతో పాటు స్థానిక ప్రజలకు తాజా కూరగాయలు అందుబాటులోకి వస్తాయన్నారు.

Also read: Nagarkurnool crime: ఊరుకొండ పేట గ్యాంగ్ రేప్ నిందితుల అరెస్ట్.. జిల్లా ఎస్పీ ఏమన్నారంటే?

మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను త్వరలోనే ప్రారంభించేలా మార్కెటింగ్ శాఖ సంచాలకులకు ఆదేశాలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ రైతుకు వచ్చే లాభాలు పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా రైతు బజార్ ప్రారంభించామన్నారు. రైతులు ఏ పంటలు పండించాలి, ఎలా పండించాలి అనే అంశాలపై దృష్టి సారించి లాభసాటి సాగు గురించి జిల్లాలో మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని కలెక్టర్ తెలిపారు.

మధ్యవర్తులను నివారిస్తూ రైతులకు అధిక లాభం లభించేలా రైతు బజార్ లను ఏర్పాటు చేశామని, 35 లక్షలతో గాంధీ చౌక్ వద్ద మరో మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, మరో నెల రోజులలో ఆ మార్కెట్ సిద్ధం చేస్తామని అన్నారు. ఈ రైతు బజార్ వద్ద రైతులు నుంచి నేరుగా వినియోగదారులు కూరగాయలను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.

 

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది