Hebah Patel
ఎంటర్‌టైన్మెంట్

Hebah Patel: అప్స్ అండ్ డౌన్స్ చూశా.. తమన్నాలా నేనెప్పుడూ హోం వర్క్ చేయలేదు

Hebah Patel: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’. ఇందులో తమన్నా నెవర్ బిఫోర్ అవతార్‌లో అలరించడానికి సిద్ధమవుతున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వంలో.. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రలో కనిపించనున్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాలని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళింది. ఈ వేసవి స్పెషల్‌గా ఏప్రిల్ 17న ఈ సినిమా థియేటర్స్‌లోకి వచ్చేందుకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ హెబ్బా పటేల్ ఈ చిత్ర విశేషాలను చెప్పుకొచ్చారు. ఆమె మాట్లాడుతూ..

Also Read- Arjun Son Of Vyjayanthi: నందమూరి హీరో సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

‘‘ఓదెల రైల్వే స్టేషన్ లాక్‌డౌన్ టైమ్‌లో చేసిన సినిమా. కరోనా టైమ్‌లో సంపత్ నంది అండ్ టీం ధైర్యంగా ఆ సినిమా చేయడం జరిగింది. నిజానికి ఆ సమయంలో దీనికి సీక్వెల్ ఉంటుందని నేను అనుకోలేదు. ఆ సినిమా చాలా మంచి విజయాన్ని అందుకుని, అందరి ప్రశంసలను రాబట్టుకుంది. ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘ఓదెల 2’ ఈ స్థాయిలో ఉంటుందని, ఇంత గ్రాండ్ స్కేల్‌లో ఉంటుందని అస్సలు ఊహించలేదు. ఓదెల1 అవుట్ అండ్ అవుట్ మర్డర్ మిస్టరీ అయితే ‘ఓదెల 2’ సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఇందులో అద్భుతమైనటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఆడియన్స్‌కి గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ని ఈ సినిమా ఇస్తుంది.

ఇందులో తమన్నాతో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. తను నా సిస్టర్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. అయితే సినిమాలో ఎక్కువ శాతం నేను జైలు ఎపిసోడ్స్‌లోనే కనిపిస్తాను. తమన్నా ప్రతి క్యారెక్టర్‌ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఒక పాత్ర కోసం ఆమె ప్రిపేర్ అయ్యే విధానం నాకు బాగా నచ్చింది. ‘ఓదెల2’ కోసం ఆమె అద్భుతంగా ప్రిపేర్ అయ్యారు. నిజానికి ఓదెల సినిమా చేస్తున్నప్పుడు నా క్యారెక్టర్ గురించి నేను ముందుగా ఏం ప్రిపేర్ కాలేదు. ఆమెలా హోంవర్క్ నేనెప్పుడూ చేయలేదు కూడా. భవిష్యత్‌లో ఆమెలా హోంవర్క్ చేయాలని నేర్చుకున్నాను. ఓదెల ఫస్ట్ పార్ట్‌లో నా పాత్ర ఎంత ఇంపాక్ట్ చూపించిందో, ఈ సెకండ్ పార్ట్‌లో కూడా అంతకంటే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ‘కుమారి 21ఎఫ్’ నాకో ఫేమ్ తీసుకొచ్చింది. ‘ఓదెల’ యాక్టర్‌గా నాకు ఒక క్రెడిబిలిటీ ఇచ్చింది. నేను అన్ని రకాల పాత్రలు చేయగలనని నమ్మకాన్ని కల్పించింది. ఒక నటిగా ఓదెల సినిమాతో చాలా విషయాలు నేర్చుకున్నాను.

Also Read- Mythri Movie Makers: ‘రాబిన్‌హుడ్’తో మైత్రీ బ్యానర్‌ ప్రతిష్ఠ దిగజారిందా?

సంపత్ నంది విజనరీ ఫిలిం మేకర్. ఓదెల1 కథలో నా క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకే షాకింగ్ అనిపించింది. అంత పర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్ నేను చేయగలనా? అని భయపడ్డాను కూడా. సంపత్ నంది నాపై ఎంతో నమ్మకాన్ని కనబరిచారు. ఆయన నమ్మకం నాకు మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చింది. చాలా నైస్, కైండ్ పర్సన్. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. డైరెక్టర్ అశోక్ తేజతో ఓదెల సినిమా నుంచి కలిసి పని చేశాను. ఆయన చాలా క్లారిటీతో ఉంటారు. సంపత్ నంది, అశోక్ తేజ మంచి టీం వర్క్‌తో పని చేస్తారు. నిర్మాత మధు ఈ ప్రాజెక్ట్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని చాలా గ్రాండ్ స్కేల్‌లో నిర్మించారు. ఈ సినిమా ముహూర్తాన్ని కాశీలో చేయడం జరిగింది. అలాగే టీజర్‌ని కుంభమేళాలో లాంచ్ చేసాం. ఈ కథ అలా డిమాండ్ చేస్తుంది. మాకు ఆ డివైన్ పవర్ కూడా సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నాం.

ఇండస్ట్రీలో వచ్చి పదేళ్లు పూర్తయింది. ఈ ప్రయాణం ఆనందంగానే ఉంది. అప్స్ అండ్ డౌన్స్ చూశాను. అయితే ఒక నటిగా నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉన్నాను. సక్సెస్, ఫెయిల్యూర్ ఏది ఫైనల్ కాదు. పని చేసుకుంటూ వెళ్లి పోవడమే మన చేతిలో ఉంది. ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను. మరో 10 ఏళ్లు నటిగా ప్రయాణిస్తాననే నమ్మకం నాకుంది. ఇప్పటివరకు చాలా జోనర్స్‌లో సినిమాలు ట్రై చేశాను. ఒక ఫుల్ ఫ్లెజ్డ్ కామెడీ ఎంటర్‌టైనర్ చేయాలనుంది. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు రిలీజ్‌కు రెడీగా అవుతున్నాయి. ఒక కన్నడ సినిమా చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ ప్రారంభమవుతుంది’’ అని హెబ్బా పటేల్ చెప్పుకొచ్చింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు