పరకాల స్వేచ్ఛ: Hanamkonda Fire Accident: ఎంతో కష్టపడి అనేక ఇబ్బందులకొర్చి ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంట బుగ్గిపాలు అయ్యింది. రైతుల కష్టం, పెట్టుబడి పోయి బూడిదే మిగిలింది. హనుమకొండ జిల్లా సంగం మండలం తీగరాజు పల్లి గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో గద్దు నర్సయ్య రైతు అనే రైతుకు చెందిన ఎకరం మొక్కజొన్న బూడిదపాలు అయ్యింది.
బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం సాయంత్రం ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మంటలు వ్యాపించడంతో పంట మొత్తం కాలిపోయింది. దీని ప్రక్కనే ఉన్న మరో రైతు ఆబోతు దూడయ్య అనే రైతుకు చెందిన ఎకరంనర మొక్కజొన్న పూర్తిగా మంటల్లో కాలిపోయినట్టు బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Also Read: Goats killed: రైల్వే పట్టాలపై.. మూగజీవులు మృత్త్యువాత!.. కారణం..