How Many Will Be Jailed Before Elections Asks Supreme Court
జాతీయం

Cm Stalin: స్టాలిన్ గారూ, ఇదేం పద్ధతండీ..?

– యూట్యూబర్ అరెస్టుపై సుప్రీం మండిపాటు
– విమర్శించిన అందరినీ అరెస్టు చేయగలరా?
– బాధితుడికి బెయిల్ మంజూరు

How Many Will Be Jailed Before Elections Asks Supreme Court: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పై విమర్శలు చేశాడన్న ఆరోపణలతో అరెస్టైన ఓ యూట్యూబర్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ను పునరుద్ధరించింది. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేసే ప్రతి ఒక్కరినీ జైలుకు పంపడం సరికాదని వ్యాఖ్యానించింది.

వివరాళ్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన యూట్యూబర్ దురై మురుగన్ ను 2021 అక్టోబరులో పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం స్టాలిన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనేది ఆరోపణ. అయితే.. అతడికి బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలో కోర్టు కల్పించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశాడనే కారణంతో 2022లో మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ అతడి బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో… మురుగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర బెయిల్ లభించింది. నాటి నుంచీ అతడు బయటే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో హైకోర్టు రద్దు చేసిన అతడి రెగ్యులర్ బెయిల్ తీర్పును సవాల్ చేస్తూ మురుగన్ సుప్రీంని ఆశ్రయించాడు. ఈ బెయిల్ మీద వాదనల సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

Also Read: సూర్యగ్రహణం భారత్‌లో ఎందుకు కనిపించలేదు?

ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారాలు, ప్రత్యర్థులపై చేసే విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, ఒక్కోసారి కొందరు తప్పుడు ప్రచారాలకూ దిగుతాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ‘యూట్యూబ్‌‌లో విమర్శలు చేసిన ప్రతి మనిషినీ అరెస్టు చేసుకుంటూపోతే.. ఎన్నికలకు ముందు ఎంతమందినని మీరు జైల్లో పెడతారు? అని తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది! ఇదే సమయంలో కోర్టు ఇచ్చిన స్వేచ్ఛను అతడు దుర్వినియోగం చేసినట్లు ఎలాంటి సాక్ష్యాలు లేవని చెబుతూ రెగ్యులర్‌ బెయిల్‌ ను పునరుద్ధరిస్తూ తీర్పు వెలువరించింది.

కొడంగల్ నియోజకవర్గం నుంచి అరవై ఏళ్ల క్రితం అచ్యుతా రెడ్డి గారు గెలిచి మంత్రి అయ్యారనీ, ఆ తర్వాత మరెవరికీ మంత్రిగా అవకాశం రాలేదన్నారు. ఇన్నేళ్ల తర్వాత సోనియా గాంధీ ప్రోత్సాహం, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తనకు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కొడంగల్ నియోజక వర్గానికి వందరోజుల్లో మెడికల్, ఇంజనీరింగ్, వెటర్నరీ, నర్సింగ్ జూనియర్, డిగ్రీ కాలేజీలు సాధించామని గుర్తుచేశారు. వందల కోట్లతో తండాలకు రోడ్లు వేసుకున్నామనీ, రూ.4 వేల కోట్లతో నారాయణ్ పేట్- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని సాధించామని గుర్తు చేశారు.

Also Read: భారత్‌లో బీబీసీ న్యూస్ రూం బంద్‌, రీజన్ అదేనట..!

బీజేపీలో జాతీయ ఉపాధ్యక్ష పదవి తెచ్చుకున్న అరుణమ్మ, పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా తేలేకపోయారని ఎద్దేవా చేశారు. పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ఈ ప్రాంతానికి ఏం చేశారు? మరోసారి ఓటేస్తే ఆయనేమైనా చంద్రమండలానికి రాజవుతారా? అని ప్రశ్నించారు. కొడంగల్ అభివృద్ధిని అడుగడుగునా బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకే రేవంత్ రెడ్డిని ఓడించాలని బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు.

ఓట్ల కోసం మతాల మధ్య గొడవలు పెట్టటం ద్వారా కుట్రలకు పాల్పడేవారిని ఉపేక్షించొద్దని, వారి కుట్రలన్నీ కొడంగల్ అభివృద్ధిని అడ్డుకునేందుకేనని అభిప్రాయపడ్డారు. ఎవరెన్ని అడ్డంకులు వేసినా కొడంగల్ నియోజక వర్గాన్ని దేశంలోనే అత్యుత్తమ, ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. ఏ పదవిలో ఉన్నా తన గుండె చప్పుడు కొడంగల్ మాత్రమేనని, తన చేత కొట్టాడి పనిచేయించుుకునే హక్కు ప్రతి కొడంగల్ నియోజక వర్గ ఓటరుకూ ఉందని స్పష్టం చేశారు.

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?