Solar Eclipse
జాతీయం

Solar Eclipse: సూర్యగ్రహణం భారత్‌లో ఎందుకు కనిపించలేదు?

Space: ఖగోళంలో జరిగే పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆ అనంతం గురించి ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాస సహజంగానే పెరుగుతుంది. అందుకే సూర్యగ్రహణమైనా.. చంద్రగ్రహణమైనా.. మరే ఇతర అంతరిక్ష పరిణామాలైనా ఆసక్తిగా చూస్తుంటారు. ఏప్రిల్ 8వ తేదీన రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది .మెక్సికో, కెనడాలోని పలుచోట్లా సూర్యగ్రహణం కనిపించింది. మరికొన్ని పొరుగు దేశాల్లో పాక్షికంగా కనిపించింది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నాసా వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

సూర్యగ్రహణంతో ఉత్తర అమెరికా 4.28 నిమిషాలపాటు చీకటిమయమైంది. ఈ అద్భుతాన్ని వీక్షించడానికి చాలా మంది ఉత్తర అమెరికాకు, మెక్సికోకు వెళ్లారు. మరికొందరైతే ఆ సమయంలో విమానంలో ప్రయాణించాలని, అక్కడి నుంచి సూర్యగ్రహణాన్ని వీక్షించాలనీ కలలు కని తీర్చుకున్నారు. కొన్ని ఎయిర్‌లైన్లు ప్రత్యేకంగా ఇందుకోసం విమానాలు నడిపాయి. సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోయిన వారి కోసం నాసా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టింది. అంతేకాదు, అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్ నుంచి ఓ ఆస్ట్రోనాట్ సూర్యగ్రహాణం కారణంగా చంద్రుడి నీడ భూమిపై పడిన ప్రాంతాన్నీ వీడియో తీశారు. ఆ వీడియోను కూడా నాసా పోస్టు చేసింది.

Also Read: రాజకీయ పార్టీల ఉగాది పచ్చడి.. చేదు రుచి, తీపి కబురుల పొలిటికల్ రెసిపీ

ఇదంతా బానే ఉంది. కానీ, ఇండియాలో ఎందుకు ఈ సూర్యగ్రహణం కనిపించలేదు? భూమి, సూర్యుడికి నడుమ చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు స్వయంప్రకాశితుడు కాదు. సాధారణంగా చాలా వరకు సూర్యగ్రహణాలు పాక్షికంగానే ఉంటాయి. సూర్యుడి కంటే చంద్రుడు పరిమాణంలో చాలా చిన్న. ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడాలంటే.. సూర్యుడికి చంద్రుడు అడ్డు వచ్చి ఆ చంద్రుడి నీడ మొత్తం భూమిని కప్పేయాలి. అలా జరగాలంటే ఈ మూడు ఒకే సరళ రేఖ మీదికి వచ్చినప్పుడు భూమి నుంచి చంద్రుడు నిర్ణీత దూరంలో ఉండాలి.

చంద్రుడు పరిమాణంలో చిన్నవాడు కాబట్టి.. అలాగే భూమికి సమీపంలో ఉన్నప్పుడు ఆ నీడ సైజు కూడా చిన్నగే ఉంటుంది. నీడ పడిన ప్రాంతాల ప్రజలే సూర్యగ్రహణాన్ని వీక్షించగలుగుతారు. ఆ నీడ పడిన ప్రదేశంలో భారత్ లేదు. సూర్యుడి చుట్టూ భూకక్ష్యకు సాపేక్షిక చంద్రుడి కక్ష్యపైన.. సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుందనేది ఆధారపడి ఉంటుంది. భూమికి, సూర్యుడికి నడుమ చంద్రుడు తన కక్ష్యలో ఏ స్థానంలో ఉన్నాడు అనేది.. సూర్యగ్రహణం ఏ దేశంలో కనిపిస్తుందనేదాన్ని డిసైడ్ చేస్తుంది. మన దేశంలో సూర్యగ్రహణం 2031లో ఏర్పడనుంది.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?