NHSRCL Jobs : బీ.టెక్ చదివిన వారికి నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 141 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. BE/ B. టెక్, డిప్లొమా లేదా MBA ఉన్న అభ్యర్థులు NHSRCL రిక్రూట్‌మెంట్ 2025 సద్వినియోగం చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. విద్యా అర్హత, పే స్కేల్, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు రుసుము, దరఖాస్తు విధానం , ముఖ్యమైన తేదీల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
వయోపరిమితి
వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది
పే స్కేల్
అభ్యర్థులకు నెలకు రూ.2,40,000/- వేతనం అందిస్తారు.
Also Read: BRS vs Congress: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. నీటి విడుదలపై రాజకీయ రగడ.. వివాదం ఎందుకంటే?
దరఖాస్తు రుసుము
SC/ST/మహిళలు: లేదు
ఇతర అభ్యర్థులు: రూ.400/- ను చెల్లించాలి.
2025 కోసం NHSRCL రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు విధానం
1. ముందుగా NHSRCL యొక్క అధికారిక వెబ్‌సైట్ పై క్లిక్ చేయండి.
2. ఆ తర్వాత నోటిఫికేషన్ వివరాలను ధృవీకరించండి.
3. క్రిందికి స్క్రోల్ చేసి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి లింక్‌పై క్లిక్ చేయండి
4. దరఖాస్తు ఫారమ్‌లో పూర్తి వివరాలను పూరించండి
5. ఆ తర్వాత దరఖాస్తు రుసుము చెల్లించండి
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు తేదీ 15 ఏప్రిల్ 2025