No Election Code To Modi Sarkar
Politics

PM Modi: ప్రధాని మోడీ టార్గెట్.. యాక్షన్‌ మోడ్‌లోకి కాంగ్రెస్

Congress: కాంగ్రెస్ పార్టీ యాక్షన్ మోడ్‌లోకి వచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ టార్గెట్‌గా ఎన్నికల సంఘాన్ని కలిసింది. బీజేపీపై మొత్తం ఆరు ఫిర్యాదు చేసింది. అందులో రెండు ఫిర్యాదులు ప్రధాని మోడీపై ఉన్నట్టు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెల్లడించారు. న్యాయ్ పత్రను చూస్తే ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తున్నదని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.

కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల కోసం మ్యానిఫెస్టో విడుదల చేసింది. దీనికి న్యాయ్ పత్ర అని పేరుపెట్టింది. ఇందులో ఐదు గ్యారంటీలు, ఒక్కో గ్యారంటీలో మళ్లీ ఐదేసి హామీలను పొందుపరిచింది. ఢిల్లీలో ఈ మ్యానిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విడుదల చేశారు. 140 కోట్ల భారత ప్రజలను ఆకాంక్షలకు, లక్ష్యాలకు ప్రతిబింబం ఈ మ్యానిఫెస్టో అని కాంగ్రెస్ పేర్కొంది. అన్ని వర్గాల ప్రజల ప్రగతికి దోహదపడేలా ఈ మ్యానిఫెస్టో రూపొందించామని వివరించింది.

Also Read: ఈడీని కలిసిన రఘునందన్ రావు.. ఎందుకు?

కాగా, ఈ మ్యానిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. ఈ మ్యానిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తున్నదని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకులకు ఆగ్రహం తెప్పించింది. వెంటనే కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఈసీని కలిసి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు యాక్షన్ తీసుకుని ఎన్నికల సంఘం తన స్వతంత్రతను చాటుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. అన్ని పార్టీలు సమానమే అని చాటిచెప్పాల్సిన అవసరం ఉన్నదని ఒత్తిడి తెస్తున్నారు.

ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా మోడీని విమర్శించారు. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో 180 సీట్లు కూడా బీజేపీకి దక్కేలా లేవని, అందుకే బీజేపీ నాయకుల్లో భయం మొదలైందని అన్నారు. ఆ భయంతోనే హిందు ముస్లిం అస్త్రాన్ని మరోసారి బయటికి తీస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతున్నదని, ఇది వారికి తెలిసి హైరానా పడుతున్నారని అన్నారు. ఆర్ఎస్ఎస్ తన పాత మిత్రుడైన ముస్లిం లీగ్‌ను గుర్తుకు తెచ్చుకుంటున్నదని వ్యంగ్యంగా కామెంట్ చేశారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!