HIT The 3rd Case: మరో 30 రోజుల్లో నేచురల్ స్టార్ నాని ఊచకోత ఎలా ఉంటుందో చూస్తారు. అవును, నాని హీరోగా ఆయన నిర్మిస్తోన్న ‘హిట్’ ఫ్రాంచైజ్ నుంచి రాబోతున్న ‘HIT: ది 3rd కేస్’ సినిమా మరో 30 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ విషయం తెలుపుతూ మేకర్స్ మంగళవారం ఓ స్టన్నింగ్ పోస్టర్ వదిలారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘HIT: ది 3rd కేస్’. ఇప్పటికే ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. విశ్వక్ సేన్, అడవి శేష్ తర్వాత మూడో పార్ట్‌గా రాబోతున్న ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని పవర్ ఫుల్‌గా కనిపించబోతున్నారు. విజనరీ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో HIT సిరీస్‌లో మూడవ భాగంగా రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ ప్రేమ వెల్లువకు అద్భుతమైన స్పందన రావడంతో పాటు సినిమాపై భారీ అంటే భారీగా అంచనాలను పెంచేశాయి. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యునానిమస్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు.
Also Read- Naga Vamsi: నిర్మాత నాగవంశీని బాయ్‌కాట్ చేసే దమ్ముందా?
ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం 1 మే, 2025న థియేటర్లలోకి రానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మేకర్స్ 30 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్‌ని ఏప్రిల్ 1న రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో నాని ఇంటెన్స్ లుక్‌లో సిగరెట్ కాలుస్తూ, గన్ గురి పెట్టి తనదైన స్టైల్‌లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటమే కాకుండా.. ఈ సినిమా పేరును ట్రెండ్‌లోకి తీసుకొచ్చేసింది. నాని ఇంతకు ముందు ఈ తరహా చిత్రాలు చేసింది లేదు. అసలీ పార్ట్‌లో నాని నటిస్తాడని కూడా ఎవరూ ఊహించలేదు. అనూహ్యంగా నాని పేరు అనౌన్స్ కాగానే ఒక్కసారిగా ఈ సినిమాపై క్రేజ్ పెరిగిపోయింది. ఆ క్రేజ్‌కి తగ్గట్టే వస్తోన్న ఒక్కో అప్‌డేట్.. ఎప్పుడెప్పుడు సినిమాను చూస్తామా అనే ఆతృతను పెంచేస్తోంది.
Also Read- Akkada Ammayi Ikkada Abbayi Trailer: 60 మందికి ఒకే అమ్మాయి.. సమ్మర్‌కి హిలేరియస్ ఎంటర్‌టైనర్!
ఆ ఆతృతను మరింత పెంచేలా మేకర్స్ కౌంట్ డౌన్‌ని స్టార్ట్ చేశారు. మరి డైలీ ఓ పోస్టర్ వదులుతారో, లేదంటే రెండు మూడు రోజులకు ఒకసారి కౌంట్ డౌన్ పోస్టర్స్ వదులుతారో తెలియదు కానీ, ఏది వదిలినా ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్ ట్రీట్ ఇవ్వడం కాయం అని ఈ పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చేశారు. నాని ఫెరోషియస్ పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాకు సంబంధించి రీసెంట్‌గా రిలీజైన టీజర్ బోల్డ్ స్టోరీ టెల్లింగ్, నాని ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో బజ్‌ను క్రియేట్ చేసింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌ని రిడిఫైన్ చేసి ఈ మూవీ ప్రేక్షకులకు నెవర్ బిఫోర్ ఎక్స్‌పీరియన్స్ అందించబోతోందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. నాని సరసన శ్రీనిధి శెట్టి (‘కెజియఫ్’ ఫేమ్) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. టాప్ టెక్నిషీయన్స్ పనిచేస్తున్న ఈ సినిమా కచ్చితంగా ఈ ఫ్రాంఛైజ్ వేల్యూని మరింతగా పెంచుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు