Naga Vamsi: ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా నిర్మాత నాగవంశీ మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా రివ్యూ రైటర్స్‌పై ఆయన విరుచుకు పడ్డారు. అంతేనా, దమ్ముంటే నా సినిమాలను బాయ్‌కాట్ చేసుకోండి అంటూ సవాల్ కూడా విసిరారు. మరి సినిమా ప్రమోషన్స్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేశారో, లేదంటే నిజంగానే బాధతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ.. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో దుమారాన్ని రేపుతున్నాయి. రివ్యూలపై తన అభిప్రాయం చెబుతూనే.. రివ్యూల తర్వాత కూడా సినిమాను కిల్ చేస్తున్న వారిని ఉద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read- Sai Kumar: ‘అభినయ వాచస్పతి’ బిరుదుతో డైలాగ్ కింగ్‌కు సన్మానం.. ఎక్కడంటే?
‘‘మా మీద బ్రతుకుతూ.. మమ్మల్ని ఎందుకు చంపాలని అనుకుంటున్నారు. ఏంటా శాడిజం? నేను సినిమా తీస్తేనే మీ వెబ్ సైట్స్ రన్ అవుతాయి. నేను యూట్యూబ్‌కి ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్స్ రన్ అవుతాయి. మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్ సైట్స్ రన్ అవుతాయి. మరి ఎందుకు సినిమాని చంపేస్తున్నారు. పేర్లు మెన్షన్ చేయడం నాకు ఇష్టం లేదు కానీ, కొందరు కావాలని పని గట్టుకుని మరీ సినిమాలను కిల్ చేస్తున్నారు. అర్థం పర్థం లేని లాజిక్స్ తీస్తున్నారు. సీక్వెల్ పేరుతో ఆడుతుంది అని అనడానికి వాళ్లేం స్టార్ హీరోలు కాదు. నేను ముందే చెప్పాను.. లాజిక్స్ వెతకవద్దని. అయినా కూడా కొందరు, కలెక్షన్స్ లేవంటూ, టికెట్స్ తెగడం లేదంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు.
నిజంగా నా సినిమా వసూళ్ళపై ఎవరికి డౌట్ ఉందో రండి. నా ఫోన్ చూడండి. నాకు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి లిస్ట్ వస్తుంది. అందులో ఎటువంటి ఫేక్ ఉండదు. నైజాం కలెక్షన్స్ చూపిస్తా రండి. ఇదేం స్టార్ హీరో సినిమా కాదు.. వరసగా హౌస్‌ఫుల్ బోర్డ్స్ పడటానికి, కార్బన్ బుకింగ్ చేయడానికి. అంతగా మామీద మీకు కోపం ఉంటే.. మా సినిమాలు బ్యాన్ చేయండి. మా సినిమాలపై ఆర్టికల్స్ రాయకండి. నా దగ్గర యాడ్ తీసుకోకండి. నా సినిమాలకు రివ్యూ రాయకండి. చూద్దాం.. నేను ఓపెన్‌గా చెబుతున్నా. నా సినిమాలు బ్యాన్ చేయండి.. నేను ఎలా నా సినిమాను ప్రమోట్ చేసుకోవాలో.. అలా చేసుకుంటా. కేవలం మీ వెబ్‌సైట్స్ ప్రమోట్ చేస్తేనే సినిమాలేం ఆడటం లేదు కదా.
Also Read- Mega157: బ్లాక్ బస్టర్ మెషీన్ డ్యూటీ ఎక్కేశాడు.. రాబోయే సంక్రాంతికి రఫ్ఫాడించుడే!
నేను మళ్లీ చెబుతున్నాను.. నేను ఎవరి మీద గొడవ పెట్టుకోవాలని రాలేదు. మా జాబ్ మేము సినిమాలు తీయడం, మీ జాబ్ మీరు రివ్యూలు రాయడం. రివ్యూ అనేది ఒకరి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నచ్చితే నచ్చిందని రాస్తారు, లేదంటే నచ్చలేదని రాస్తారు. అందులో తప్పు లేదు. అలా నిజాయితీగా ఇచ్చే రివ్యూలను మేము స్వాగతిస్తాము. రివ్యూలు రాసిన రోజు మేము చెప్పాం, స్వీకరించాం.. కానీ ఆ తర్వాత ఏది కరెక్ట్‌గా ఈ సినిమా విషయంలో జరగలేదు. అలాంటివి రిపీట్ చేయకండి.. రిపీట్ చేస్తే.. మీ దారి మీరు చూసుకోండి.. మా దారి మేము చూసుకుంటాం.. అంతే!’’ అంటూ నాగవంశీ ఫైర్ అయ్యారు.
నిజంగా బ్యాన్ చేసే దమ్ముందా?
ఇక్కడ ఒకరిద్దరు వెబ్‌సైట్ వాళ్లు ఏదో రాశారని, అంత పెద్ద నిర్మాత ఇలాంటి మీడియా సమావేశాలు నిర్వహించడం ఎంత వరకు సబబో ఆయనకే తెలియాలి. సినిమాలో దమ్ముంది, కంటెంట్ ఉంది, కలెక్షన్స్ ఉన్నాయి.. బ్రేకివెన్ ఎప్పుడో అయిపోయిందని చెబుతున్నప్పుడు ఎందుకింత పంచాయితీ? అనేది ఆలోచించాల్సిన విషయమే. అయినా, మీడియా వారు బయట స్నాక్స్ తింటున్నారని అన్నందుకే, సుమ కనకాలతో సారీ చెప్పించారు. మరీ పబ్లిగ్గా, ఒక నిర్మాత బాయ్ కాట్ చేసుకోండి అంటూ ఛాలెంజ్ విసురుతున్నాడు. మరి నిజంగా మీడియా వాళ్లకి నాగవంశీని బాయ్‌కాట్ చేసే దమ్ముందా? మీడియా వాళ్లు దీనిపై ఏమైనా ఆలోచిస్తారా? లేదంటే తుడిచేసుకుంటారా? అనేది చూడాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు