Raghurama Krishna Case(Image Credit: Twitter)
ఆంధ్రప్రదేశ్

Raghurama Krishna Case: రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టు కీలక సూచనలు

Raghurama Krishna Case: రఘురామ కృష్ణ రాజు కస్టోడీయల్ టార్చర్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (GGH) సూపరింటెండెంట్ ప్రభావతి పాత్రపై సుప్రీంకోర్టు మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గతంలో రఘురామ కృష్ణ రాజు కస్టోడీలో ఎలాంటి గాయాలు లేవని ప్రభావతి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశించింది.

జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం, ప్రభావతి ఈ నెల 7 మరియు 8 తేదీల్లో ఉదయం 10 గంటలకు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ రెండు రోజుల్లో జరిగే విచారణలో ఆమె లిఖితపూర్వకంగా అన్ని సమాధానాలు అందించాలని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఆమె విచారణకు సహకరించకపోతే, గతంలో జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం కల్పించిన మధ్యంతర ఉపశమనం రద్దు అవుతుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది.

సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రభావతి దర్యాప్తుకు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోర్టుకు తెలిపారు. ఆమెకు నోటీసులు పంపినప్పుడల్లా ఆమె స్వయంగా స్పందించకుండా, ఎవరో ఒకరు ఆమె తరపున సమాధానం ఇస్తున్నారని లూత్రా వాదించారు. ఏదో ఒక సాకు చూపి ఆమె విచారణకు హాజరు కావడం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఈ వాదనలకు సాక్ష్యాలను కూడా కోర్టుకు సమర్పించినట్లు లూత్రా తెలిపారు.

Also Read: పవన్ కు ఊహించని దెబ్బ.. వైసీపీలోకి వర్మ.. పిఠాపురంలో ఏం జరుగుతోంది?

మరోవైపు, ప్రభావతి తరపు న్యాయవాది కోర్టుకు వివరణ ఇస్తూ.. ఆమెను ఒక్కసారి మాత్రమే విచారణకు పిలిచారని, ఆ తర్వాత రెండు నెలల పాటు మళ్లీ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వాదించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ప్రభావతి తరపు న్యాయవాదుల మధ్య వాదనలు జరిగాయి.

ఈ వివాదంపై మధ్యే మార్గాన్ని సూచిస్తూ, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 7, 8 తేదీల్లో జరిగే విచారణలో ప్రభావతి హాజరై, అన్ని ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు అందించాలని తేల్చి చెప్పింది. ఈ విచారణ పూర్తయిన తర్వాత తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది.

గతంలో ఈ కేసులో ప్రభావతికి మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆమె దర్యాప్తుకు సహకరించాలని ఆ మధ్యంతర ఉత్తర్వుల్లోనూ పేర్కొన్నప్పటికీ, ఆమె సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.

Also Read: శ్రీవారిని నిద్రపోనివ్వరా.. ఇదే మీ సనాతనమా.. పవన్ కు రోజా చురకలు

రఘురామ కృష్ణ రాజు కస్టోడీయల్ టార్చర్ కేసు ఇప్పటికీ వివాదాస్పదంగా కొనసాగుతోంది. ప్రభావతి ఈ నెల 7, 8 తేదీల్లో విచారణకు హాజరై సహకరిస్తారా లేదా అనేది ఈ కేసు భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశంగా మారనుంది. తదుపరి విచారణ ఈ నెల 15న జరగనుండగా, ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారుతోంది.

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు