CPM Party Warning | బీజేపీని ఒక్క సీటూ గెలవనివ్వం
CPM State Executive Committee Will Let BJP Win One Seat In Telangana
Political News

CPM Party Warning: బీజేపీని ఒక్క సీటూ గెలవనివ్వమన్న సీపీఎం రాష్ట్ర కార్యవర్గం

– సీపీఎం నేత వీరయ్య కామెంట్
– కాంగ్రెస్ కలిసిరావటం లేదని వ్యాఖ్య
– రాముడి పేరుతో రాజకీయమేంటని మండిపాటు

CPM State Executive Committee Will Let BJP Win One Seat In Telangana: తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటూ దక్కనీయబోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు.ఆదివారం సీపీఎం సంగారెడ్డి జిల్లా స్థాయి సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని ఓడించేందుకు విపక్షాలను కలుపుకుపోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదేననీ, కానీ ఆ పార్టీ దీనిపై దృష్టి సారించటం లేదని అభిప్రాయపడ్డారు. బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాల వల్ల దేశవ్యాప్త వ్యతిరేకత పెరిగిందని, పదేళ్ల పాలనలో బీజేపీ చేసిన విధ్వంసానికి ఈ లోక్‌సభ ఎన్నికలతో ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.

బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదముందని, తద్వారా కుల, మత, ప్రాంత విద్వేషాలకు అంతులేకుండా పోయే దుస్థితిని దేశం ఎదుర్కోవాల్సి రావచ్చిన ఆందోళన వ్యక్తం చేశారు. ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను వేధించడం, మేధావులను జైలుపాలు చేయటం వంటివి జరుగుతున్న చర్యలను ఆయన ఖండించారు.

Also Read:ప్రశాంత్ కిశోర్ ఇలా అయిపోయాడేంటీ?

ప్రధాని మోదీ ప్రజల సమస్యల గురించి గాక రాముడి పేరుతో రాజకీయం చేస్తున్నారని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో అత్యధికంగా బీజేపీకి చేరాయని, బాండ్ల అంశంపై తమ పార్టీ పోరాడిన సంగతిని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 120 రోజులు దాటినా పేదలకు ఇళ్ల అంశంపై చొరవ తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..