BJP party (imagrcredit:twitter)
తెలంగాణ

BJP party: హైదరాబాద్ స్థానికంపై బిజెపి డైలమా? అసలేం జరుగుతోంది?

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: BJP party: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగుదామా? వద్దా? అనే సందిగ్ధంలో బీజేపీ పడింది. ఈ ఎన్నికల రేసు నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుకోవడంతో కమలదళం బరిలోకి దిగితే ఎలా ఉంటుంది? దిగకపోతే ఎలా ఉంటుందనే చర్చ పార్టీలో మొదలైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుకోవడం పరోక్షంగా ఎంఐఎంకు మద్దతునిచ్చినట్లే అవుతుందనే చర్చ జోరుగా జరుగుతున్న తరుణంలో కమలం పార్టీ ఏం చేస్తే బాగుటుందనే యోచనలో పడింది. ఎంఐఎం, బీజేపీ మధ్య ఉప్పు, నిప్పు అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది.

ఈ తరుణంలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎవరినీ ఎన్నికల్లో దింపే అవకాశం లేకపోవడంతో హిందువుల పార్టీగా చెప్పుకునే బీజేపీ కూడా రేసులో లేకుంటే ఎలా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎంఐఎంకు ఝలక్ ఇవ్వాలంటే ఈ పోటీలో దిగాల్సిందేనని కార్యకర్తలు, శ్రేణులు భావిస్తున్నాయి.

గ్రేటర్ పరిధిలో కార్పొరేషన్ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనుంది. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేసి కేడర్ లో భరోసా కల్పించాలని శ్రేణులు భావిస్తున్నారు. ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా కనీసం కేడర్ లో చైతన్యాన్ని నింపినట్లవుతుందని, ఇది భవిష్యత్ లో రాబోయే కార్పొరేషన్ ఎన్నికలకు పనికొస్తుందని కార్యకర్తలు చెబుతున్నారు. బరిలో నిలవలేదంటే యుద్ధానికి ముందే అస్త్ర సన్యాసం చేసినట్లవుతుందని చర్చించుకుంటున్నారు.

Also Eead: TG govt: ఉద్యోగుల డిస్మిస్.. 79 మందిపై ప్రభుత్వం వేటు.. ఎందుకంటే?

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. దీని ప్రకారం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు మొత్తం 110 మంది ఓటర్లున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 81 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్ అఫిషియో సభ్యులున్నారు.

పార్టీలవారీగా చూసుకుంటే కాంగ్రెస్ కు మొత్తం 14 మంది బలం ఉంది. బీఆర్ఎస్ కు 25 మంది, ఎంఐఎంకు అత్యధికంగా 49 మంది బలం ఉంది. అయితే బీజేపీకి ఓవరాల్ గా 22 మంది బలమే ఉండటం గమనార్హం. ఇందులో 19 మంది కార్పొరేటర్లు, ఒక ఎమ్మెల్యేల, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ ఉన్నారు. కాగా ఈ ఎన్నికకు మార్చి 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 4వ తేదీ వరకు గడువు ఉంది.

ఏప్రిల్ 7న పరిశీలన, 9 వరకు విత్ డ్రా, 23న పోలింగ్, 25న కౌంటింగ్ నిర్వహించనున్నారు. కాగా ఇప్పటి వరకు ఇద్దరు ఇండిపెండెంట్లు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. మజ్లిస్ సైతం ఇంకా నామినేషన్ దాఖలు చేయలేదు. ఈ తరుణంలో ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా బరిలో బీజేపీ నిలిచి కేడర్ లో భరోసా కల్పిస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: Minister Seethakka: ‘కరప్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ’.. బండిపై మంత్రి సీతక్క ఘాటు విమర్శలు

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?