TG govt(image credit:X)
తెలంగాణ

TG govt: ఉద్యోగుల డిస్మిస్.. 79 మందిపై ప్రభుత్వం వేటు.. ఎందుకంటే?

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : TG govt: రాష్ట్ర పరిశ్రమల శాఖలో దాదాపు పుష్కర కాలంగా పాతుకుపోయిన రిటైర్డ్ ఉద్యోగుల ఎక్స్ టెన్షన్ సోమవారంతో ముగిసిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలోనే కొందరు రిటైర్ అయినా తిరిగి నెలల వ్యవధిలోనే ఎక్స్ టెన్షన్ పేరుతో విధుల్లో చేరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు నుంచీ అదే హోదాల్లో కొనసాగుతుండడంతో గతేడాది మొదలుపెట్టిన ప్రక్షాళన ప్రక్రియ సోమవారంతో కొలిక్కి వచ్చింది.
ఆ శాఖ పరిధిలోని ఎనిమిది విభాగాల్లో మొత్తం 79 మందిని టెర్మినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఇందులో జనరల్ మేనేజర్లు, డిప్యూటీ జీఎంలు, అసిస్టెంట్ జీఎంలు, చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండెంట్లు, డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు.. ఇలా వివిధ హోదాల్లో ఉన్నారు. వీరంతా చివరకు ఒక్క ఉత్తర్వుతో ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇంటికే పరిమితం కానున్నారు.

Also read: TG govt on HCU Land: హెచ్ సీయూ భూముల రగడ.. తెలంగాణ ప్రభుత్వం సంచలన ప్రకటన

ఈ శాఖలోని టీజీఐఐసీ (తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్)కు చెందినవారు 20 మంది, టెస్కో (తెలంగాణ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ), గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్, లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, మినెరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ బోర్డ్ తదితర ఎనిమిది విభాగాలకు చెందినవారంతా సుదీర్ఘకాలం ఎక్స్ టెన్షన్ తర్వాత విధుల నుంచి తప్పుకున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్ టెన్షన్‌ను కొనసాగించరాదని అన్ని శాఖలకు ప్రధాన కార్యదర్శి గత వారం ఉత్తర్వులు జారీచేయడంతో ఒక్కో శాఖ నుంచి నిష్క్రమించే ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే కొన్ని శాఖల్లో ఉద్వాసన మొదలుకాగా మిగిలినవాటిలో సోమవారం సాయంత్రం కొలిక్కి వచ్చింది.

Also read: TG Govt on Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కొత్త కొలువులకు వేళాయేరా?

ఎక్స్ టెన్షన్‌ను ప్రభుత్వం రద్దు చేయడంతో ఇంటికి వెళ్తున్న ఉద్యోగుల వివరాలు :
టెస్కో : 38 మంది
టీజీఐఐసీ : 20 మంది
హస్తకళల కార్పొరేషన్ : ఏడుగురు
ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ : ఆరుగురు
ఖాదీ విలేజ్ బోర్డు నుంచి – ముగ్గురు
టీజీఐడీసీ : ఇద్దరు
లెదర్ బోర్డు : ఇద్దరు
మినెరల్ డెవలప్‌మెంట్ : ఒకరు

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?