Pithapuram News: పిఠాపురం ఆధ్యాత్మిక కేంద్రంలో ఒకటిగా వెలుగొందుతున్న పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభుని ఆలయ ఆవరణలో ఆటో యూనియన్ దందా యథేచ్ఛగా నడుస్తుంది. గతంలో ఈ యూనియన్‌పై ఫిర్యాదులు వచ్చిన సందర్బాలు చాలానే ఉన్నాయి. ఈ ఆలయానికి తెలుగు ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరుచుగా వస్తుంటారు. వారికి తెలుగు రాకపోవడం, ఇక్కడ పరిస్థితులపై అవగాహన లేకపోవడంతో ఆటో యూనియన్లు అందిన కాడికి దోచుకుంటున్నారు.
ఆటో యూనియన్‌లో సభ్యుడిగా చేరాలంటే లక్షల్లో చెల్లించాల్సి ఉంటోదని స్థానికులు చెబుతున్నారు. అలాగే గుడి నుంచి బయటకొచ్చిన భక్తులు తప్పనిసరిగా తమ ఆటోనే ఎక్కాలని యూనియన్ పట్టుబడుతోందని చెబుతున్నారు. బయట వారినే కాక సొంతవారిని సైతం ఆటో యూనియన్ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తనకు ఉపాధి లేకుండా చేసి ఊరి వదిలి పారిపోయేలా ఆటో యూనియన్ చేసిందని ఆటో డ్రైవర్ పండు దుర్గబాబు ఆరోపించారు.
Also read: Nadendla Manohar: పవన్ టార్గెట్ చెప్పేసిన నాదెండ్ల.. విలువలతో కూడిన రాజకీయాలంటూ..
ఈ విషయంపై మంగళగిరిలో ఉన్న డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయంలో, తాడేపల్లిలో ఉన్న నారా లోకేష్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన కూడా ఫలితం లేదని ఆటో డ్రైవర్ పండు దుర్గబాబు తెలిపారు. యూనియన్ నాయకుల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అటు పోలీసులకు సైతం పట్టించుకోవడం ఆరోపిస్తున్నారు.