SLBC tunnel update [ image credit; twittwr]
తెలంగాణ

SLBC tunnel update: ఎస్ఎల్ బీసీలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. పనులపై కీలక అప్ డేట్

 SLBC tunnel update: వేగంగా కొనసాగుతున్న కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు, ఎస్ ఎల్ బి సి, టన్నెల్ ప్రత్యేక అధికారి శివ శంకర్ లోతేటి, ఎస్ ఎల్ బి సి,టన్నెల్ లో కొనసాగుతున్న సహాయక చర్యలపై సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి, ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో జరిగిన ప్రమాద ప్రదేశంలో నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు,కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణను వేగవంతం చేసి, సహాయక చర్యలను మరింత సమర్థవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.సమీక్ష సమావేశంలో ఉన్నత అధికారులతో ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి, మాట్లాడుతూ ఇలా చెప్పరు.

రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నదని ,ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, హైడ్రా,సింగరేణి మైన్స్ రెస్క్యూ, దక్షిణ మధ్య రైల్వే బృందాలు ప్రతికూల పరిస్థితుల్లోను 24 గంటల పాటు శ్రమిస్తున్నరని వివరించారు. సహాయక బృందాలు, మరియు నిపుణులు సమన్వయంతో పనిచేస్తూ, మైనింగ్ ప్రమాదాల్లో నిష్ణాతులైన వారి సేవలను వినియోగించుకుంటూ, వారి సలహాలు సూచనలు తీసుకుంటూ సహాయక చర్యలు చేపడుతున్నట్లు ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి, తెలియజేశారు.

 Also Read: CM Revanth Reddy: పేదలకు సీఎం రేవంత్ అదిరిపోయే ఉగాది కానుక.. సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం

ప్రస్తుతం టన్నెల్ లో కన్వేయర్ బెల్ట్ ను 13630 మీటర్ల నుండి 13730 వరకు(వంద మీటర్లు) పునరుద్ధరిస్తున్నట్లు తద్వారా టన్నెల్ లోపల ఎస్కవేటర్ల సహాయంతో సొరంగం లోపల ఉన్న మట్టిని బయటికి తరలించడానికి పనులను కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు.సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్య లో దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది టన్నెల్లోపల సహాయక చర్యలకు అడ్డంకిగా ఉన్న స్టీల్ను కత్తిరించి లోకో ట్రైన్ ద్వారా బయటికి తరలిస్తున్నట్లు వివరించారు.

 Also Read: CM Revanth Reddy: యుద్ధప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. పనులు పరిశీలించిన సీఎం రేవంత్

సొరంగంలోని ఊట నీటిని ప్రతిరోజు అత్యధిక సామర్థ్యం గల పంపుల ద్వారా బయటికి పంపించేస్తున్నట్లు తెలిపారు. సహాయక బృందాలు ప్రతినిత్యం తమకు కేటాయించిన పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తూ సహాయక పనులను వేగవంతం చేస్తున్నారని కొనియాడారు.సహాయక సిబ్బంది పండుగలను సైతం లెక్కచేయకుండా సహాయక చర్యల్లో పాల్గొనడం అభినందనీయమని, వారి యొక్క స్ఫూర్తిని ప్రశంసించారు. మట్టి తవ్వకాలు కనుగుణంగా వెంటిలేషన్ పునరుద్ధరణ జరుగుతుందని, సహాయక సిబ్బందికి ఎటువంటి సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి, వివరించారు.

 Also Read: Telangana: మిలిటరీ కాలేజీలో చేరాలని ఉందా? మీ కోసమే గడువు పొడిగింపు..

ఈ సమీక్ష సమావేశంలో నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ దేవ సహాయం, ఆర్మీ అధికారులు వికాస్ సింగ్, విజయ్ కుమార్, ఎస్ డి ఆర్ ఎఫ్ అధికారి గిరిధర్ రెడ్డి, హైడ్రా అధికారి సుదర్శన్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే అధికారి నేతి చంద్ర, సింగరేణి మైన్స్ రెస్క్యూ అధికారి, జె పి కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు