జహీరాబాద్ స్వేచ్ఛ: Zaheerabad Crime: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని పస్తాపూర్ లో ఆదివారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. జహీరాబాద్ ఎస్ఐ కాశినాథ్ తెలిపిన వివరాల ప్రకారం ఝరాసంగం మండలం చిలేపల్లి గ్రామానికి చెందిన మ్యాతరి లక్ష్మి (47) గత 20 సంవత్సరాలుగా పస్తాపూర్ లో అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనోపాధి కొనసాగించుకుంటుంది.
ఆదివారం గుర్తు తెలియని వారు ఇంట్లోకి వచ్చి లక్ష్మి కంట్లో కారం చల్లి గ్యాస్ సిలిండర్ తో తలపై బాది దారుణంగా హత్య చేశారు. సంఘటన స్థలాన్ని జహీరాబాద్ సిఐ శివలింగం, ఎస్సై కాశీనాథులు పరిశీలించి హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్లను రప్పించి హత్య జరిగిన ప్రాంతంలో నమోనాలను సేకరించారు.
లక్ష్మి హత్యకు గల కారణాలను అన్ని కోణాల నుంచి క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శివలింగం తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Tiger Spotted Roaming: పెద్ద పులి సంచారం.. బిక్కుబిక్కుమంటున్న ప్రజలు