Jagga Reddy: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ( Jagga Reddy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ” జగ్గా రెడ్డి – ఎ వార్ ఆఫ్ లవ్ “. నేడు ఉగాది సందర్భంగా టీజర్ను టీజర్ ను రిలీజ్ చేశారు. అంతే కాదు, జయ లక్ష్మి ఫిల్మ్స్ పేరుతో ఆఫీసు కూడా ఓపెన్ చేశారు. ఈ ఈవెంట్ లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
” నా రాజకీయ జీవిత కథను నేనే రాసుకున్నానని చెప్పారు. హీరోలు ఎప్పుడూ ఎవరో రాసిన స్టోరీల్లో నటిస్తారు. అలాగే, పోలీసులను కొట్టినట్లు, వాళ్లతో ఫైట్ చేసినట్లు చూపిస్తారు. కానీ, నేను నిజ జీవితంలో ఇవన్నీ చేశాను. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు వేరే వాళ్లతో చేస్తూ.. నేను కూడా రోల్ ప్లే చేస్తా.. నేను విద్యార్ధి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే… నా మీద చాలా చాలా కుట్రలు జరిగాయి. నా జీవితంలో జరిగిన విషయాలనే ఈ చిత్రంలో చూపిస్తున్నానని అన్నారు.
Also Read: Mega 157: ఉగాది రోజున మెగా ట్రీట్ .. ఒకే ఫ్రేమ్ లో చిరు, వెంకీ.. ఫ్యాన్స్ కు పండుగే..!
ఈ సినిమా కార్యాలయమే ఇక నుంచి నా అడ్డా.. రాజకీయంలో నేను ఎలాంటి పనులు చేశానన్నది దీనిలో ఉంటుంది. నా సక్సెస్ పుల్ లైఫ్ జర్నీ .. సినిమాలో కూడా అదే విధంగా ఉంటుంది. చిత్ర టీజర్ పోస్టర్, వీడియోపై రియాక్ట్ అవుతూ .. నాది ఒరిజినల్ క్యారెక్టర్. పోలీసులను కొట్టినట్లు హీరోలు నటిస్తారు. కానీ, నావన్నీ ఒరిజినల్ గానే వున్నాయి. విద్యార్ధి నేతగా, కౌన్సిలర్ గా, మున్సిపల్ ఛైర్మన్ గా.. నేను ఎదుర్కొన్న కష్టాలు, బాధలు.. ఇలా అన్ని చుపించానని తెలిపారు.
నా రాజకీయ జీవిత కథ నేనే రాసుకున్న.. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్.. అన్నీ నేనే రాసుకున్న.. నా గురించి నేను ఎక్కువ ఉహించుకొను.. నా గురించి ఇతరులు కూడా ఎక్కువ ఉహించుకోవద్దునుకుంటా. ఇది నేను తీసుకున్న నిర్ణయం కాదు.
Also Reda: Upcoming Movies 2025: ఏప్రిల్‌లో సినిమా జాతర.. ఏకంగా 19 సినిమాలు పోటీ పడుతున్నాయి
కాలం చెప్పిన పనినే చేస్తున్నాను. ఇది ఖచ్చితంగా కాల నిర్ణయమే.. నేను సినిమా వైపు రావడం. డైరెక్టర్ పెద్దనా.. చిన్ననా.. అని కాదు చూడాల్సింది. నేను రాసుకున్న కథ నచ్చింది సినిమాకి ఒకే అన్న. నా కూతురు ఆలోచనలు.. నా ఆలోచనల కంటే చురుకుగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నా ఆలోచనలకు దగ్గరగా ఉంటాయని ” తెలిపాడు.